క్రీడాభూమి

క్రికెట్ అకాడమీపై లక్ష్మణ్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 14: వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని బుధవారం భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ మర్యాద పూర్వకంగా కలిశాడు. క్రీడలకు, క్రీడాకారులకు ఇస్తున్న ప్రోత్సహంపై సీఎంను అభినందించాడు. గతంలో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా అకాడమీలు ఏర్పాటయ్యేలా సీఎం కృషి చేశారని గుర్తు చేశాడు. క్రికెట్ భవిష్యత్తు దృష్ట్యా ఏపీలో యువ క్రీడాకారుల కోసం అకాడమీ ఏర్పాటుపై ఆసక్తి ఉందని తెలిపాడు. తన ప్రయత్నానికి ఏపీ అండగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపాడు.

వాన్‌కు ప్రపోజల్స్ ఎన్నో!
పయాంగ్‌చాంగ్, ఫిబ్రవరి 14: అసలే ప్రపంచ మేటి స్కీయర్.. ఆపై చూపు తిప్పుకోనివ్వని అందచందాలు.. ఇటీవలే మాజీ నంబర్ వన్ గోల్ఫర్ టైగర్ ఉడ్స్ నుంచి విడిపోయింది. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. అన్నింటినీ మించి ప్రేమికుల రోజు.. ఇంకేముంది? ఇంత మంచి అవకాశం మళ్లీ రాదనుకున్నారో ఏమోగానీ, వేల సంఖ్యలో అభిమానులు ఆమెకు ప్రపోజల్స్ పంపారు. డేటింగ్‌కు సమయం ఇవ్వాలంటూ ప్రాధేయపడ్డారు. వింటర్ ఒలింపిక్స్‌లో బిజీగా ఉన్నందున వాలెంటైన్స్ డేను మరచిపోయానని, ప్రపోజ్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని ఆమె ట్వీట్ చేసింది. ఇంతకీ తాను ఎవరినైనా ఎంపిక చేసుకుందా లేదా అనే విషయాన్ని మాత్రం చాలా గోప్యంగానే ఉంచింది. ఇంతకీ ఆమె ఎవరిని ఎంపిక చేసుకుంటుందో?