ఆంధ్రప్రదేశ్‌

ప్రపంచ స్థాయిలో పర్యాటక కేంద్రాల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 15: రాజధాని అమరావతితో సహా రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అమరావతిలో సాంస్కృతిక, వారసత్వ సంపదను కాపాడేందుకు రూ 7.5 కోట్లతో అంతర్జాతీయ మ్యూజియం నిర్మించనున్నారు. మొదటి దశలో ‘మనవూరు- మన కోడళ్లు’ పేరిట గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా సంస్కృతీ వైభవాలను చాటిచెప్పటంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశీ పర్యాటకులను ఆకర్షించే రీతిలో సదుపాయాల కల్పనకు రూ. 4.5 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాదిలో మొదటిదశ నిర్మాణాలు పూర్తయిన తరువాత మరో 3.5 కోట్లతో చెన్నై, బ్రిటీష్ మ్యూజియంలతో పాటు దేశంలోని సుప్రసిద్ధ పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరచిన రాష్ట్రానికి చెందిన పురావస్తు సంపదను అద్దె ప్రాతిపదికన మ్యూజియంలో ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే అమరావతి పురావస్తు ప్రదర్శనశాలలో నాటి బౌద్ధవాజ్ఞ్మయాన్ని చాటిచెప్పే కళాఖండాలు అనేకం ఉన్నాయి. వీటితోపాటు దేశ, విదేశీ మ్యూజియంలలో ఉన్న మన పురావస్తు సంపదను తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా అరకులోయ అందాలను మరింత ఇనుమడింప చేయటంతో పాటు ప్రపంచ పర్యాటక కేంద్రంగా రూపుదాల్చేందుకు రూ 7.7 కోట్లు మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అక్కడ ‘ట్రైబల్ హాట్’తో పాటు ‘ఈట్‌బజార్’ను రెండు దశల్లో నిర్మిస్తారు. ఇందులో భాగంగా శృంగవరపుకోటలో హరిత హిల్స్‌లో మరిన్ని కాటేజీలు, అనంతగిరిలో 400 చదరపు మీటర్ల స్విమ్మింగ్‌పూల్, సాహసయాత్రల జోన్, బొర్రాగుహల అభివృద్ధి, సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మించనున్నారు. మెడికల్ టూరిజంలో భాగంగా అరకు అడవులలో లభ్యమయ్యే హెర్బల్ వాడకాలతో పాటు యోగా, మెడిటేషన్ సెంటర్లు, డైట్ సెంటర్, లైబ్రరీ, జిమ్, రెస్టారెంట్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ ఏడాది 5.5 కోట్లతో ట్రైబల్ హాట్, వచ్చే ఏడాదిలోపు 2.2 కోట్లతో ఈట్ బజార్‌లను ఏర్పాటు చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు రూ 6 కోట్లు నిధులు మంజూరు చేసింది. తొలిదశలో హస్తకళా వస్తు ప్రదర్శనలు, ఫుడ్‌కోర్టు, యాంప్లి థియేటర్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం పొన్నాడ గ్రామంలో 9.75 ఎకరాల భూమిని కేటాయించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిని సాధించడం ద్వారా విదేశీ పర్యాటకులను ఆకర్షించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.