ఆంధ్రప్రదేశ్‌

ఏసీబీ వలలో అటవీ బీట్ ఆఫీసర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 15: కొల్లేరులో సహజసిద్ధంగా లభించే చేపలు పట్టుకోవడానికి ఒక మత్స్యకారుడి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు అటవీ శాఖ డివిజన్ అభయారణ్య బీట్ ఆఫీసర్ కె శ్రీకాంత్‌ను గురువారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని వద్ద నుంచి లంచం సొమ్ము స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. శుక్రవారం అతడిని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఏసీబీ డీఎస్పీ వి గోపాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దెందులూరు మండలం దోసపాడుకు చెందిన మేడూరి వెంకటేశ్వరరావు కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా లభించే చేపలను వేటాడి జీవనం సాగిస్తుంటాడు. దాదాపుగా కొల్లేరు పరిధిలో ఉన్న మత్స్యకారులంతా చేపల వేటపైనే ఆధారపడుతుంటారు. అయితే దీనికి బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. చేపలు పట్టుకోవాలంటే తనకు రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేకుంటే అభయారణ్యంలో ఈ కార్యక్రమాలు చేస్తున్నట్లు కేసులు నమోదు చేస్తానని బెదిరించాడు. దీంతో వెంకటేశ్వరరావు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం శ్రీకాంత్‌కు వెంకటేశ్వరరావు ఫోన్ చేసి లంచం సొమ్ము ఎక్కడివ్వాలని అడుగగా ఏలూరు రామచంద్రరావుపేటలోని విజయ మెస్‌కు రావాలని సూచించాడు. అక్కడకు చేరుకున్న వెంకటేశ్వరరావు రూ.30వేల నగదును శ్రీకాంత్‌కు అందించాడు. నగదుతో మెస్ నుంచి బయటకు వస్తున్న శ్రీకాంత్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతని వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, అరెస్టు చేశారు.