ఆంధ్రప్రదేశ్‌

అనంతలో స్పీకర్ కోడెల ఘెరావ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఫిబ్రవరి 15: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలో న్యాయవాదులు సీపీఐ, సీపీఎం నాయకుల మద్దతుతో శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును గురువారం ఘెరావ్ చేశారు. అనంతపురం వచ్చిన స్పీకర్ నగరంలోని పీస్ మెమోరియల్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు రాగా కమ్యూనిస్టు నాయకులతో కలిసి అక్కడికి చేరుకున్న న్యాయవాదులు రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని, అందుకు స్పీకర్ సహకరించాలంటూ నినాదాలు చేస్తూ బైఠాయించారు. పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి కల్పించుకుని వారిని శాంతింపజేశారు. దశాబ్దాలుగా వెనుకబడిన రాయలసీమకు అభివృద్ధి, ఇతర ముఖ్యమైన అంశాల్లో అన్యాయం చేస్తున్నారని, విభజన అనంతరం కనీసం హైకోర్టు అయినా సీమలో ఏర్పాటు చేయాలని, తద్వారా ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని కమ్యూనిస్టు నాయకులు, న్యాయవాదులు వివరించారు. అనంతరం స్పీకర్ మాట్లాడుతూ సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న మీ డిమాండ్ న్యాయమైందని, ముఖ్యమంత్రికి తెలిపి దీనిపై అసెంబ్లీలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు నారాయణస్వామి, రమణయ్య, సీపీఎం నాగేంద్ర, న్యాయవాదులు రాచమల్లు హరినాథ్‌రెడ్డి, రవికుమార్, నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. స్పీకర్ కోడెలను ఘెరావ్ చేస్తున్న న్యాయవాదులు, కమ్యూనిస్టు నాయకులు