ఆంధ్రప్రదేశ్‌

అధికార నందిపై విహరించిన శివుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 15: స్కంద రాత్రి సందర్భంగా గురువారం ఉదయం శ్రీకాళహస్తీశ్వర స్వామి అధికారనందిపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహ ప్రదానం చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్కంద రాత్రి ఉత్సవం జరిగింది. ఉదయం గంగాదేవీ సమేతుడైన సోమస్కందమూర్తి అధికార నంది వాహనంపైన అధిరోహించారు. జ్ఞానప్రసూనాంబ కోరిన వరాలిచ్చే కామధేనువు వాహనంపై అధిష్ఠించి భక్తులకు అభయప్రదానం చేశారు. భజనలు, కోలాటాలు, విచిత్రవేషధారణ, సాంస్కృతిక బృందాలు ముందు నడుస్తుండగా వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, చండికేశ్వరుడు, కన్నప్పలు వెంటరాగా ఆది దంపతులు అధికార నంది, కామధేనువు వాహనాలపై పురవీధుల్లో పర్యటించి భక్తులను కరుణించారు. గురువారం రాత్రి 11 గంటల తర్వాత ఆదిదంపతుల కల్యాణ వేడుకలు జరిగాయి. అంతకుముందు ఎదుర్కోలువంటి వివాహ ప్రక్రియను అర్చకస్వాములు పూర్తిచేశారు.