ఆంధ్రప్రదేశ్‌

చిత్తశుద్ధి ఉంటే అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఫిబ్రవరి 15: కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) నుండి విముఖత వ్యక్తమైనట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో కాపులకు రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదంతో ముందుగా రాష్ట్రంలో అమలుచేయాలని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం డిమాండుచేశారు. కాపు రిజర్వేషన్లను కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ తిరస్కరించినట్టు వార్తలొచ్చిన నేపథ్యంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు బీసీ రిజర్వేషన్ల వ్యవహారంపై మళ్ళీ రగడ మొదలవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పరిధిలోనే కాపులకు రిజర్వేషన్లు వర్తింపజేయవచ్చని ముద్రగడ స్పష్టంచేశారు. కేంద్రం పరిధిలో ఉన్న రిజర్వేషన్ల అంశం నేడో, రేపో ఓ కొలిక్కివచ్చి, బీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్న కాపు జేఏసీ తాజా పరిణామంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీనిపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ ఆమోదంతో తక్షణమే రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలుచేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారని ముద్రగడ పేర్కొన్నారు. మార్చి 31వ తేదీలోగా రిజర్వేషన్లు అమలుచేయని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కాపు జేఏసీ హెచ్చరించింది. కాపు రిజర్వేషన్ల పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేనట్టు మరోసారి రుజువైందని ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రబాబు చేసిన తీర్మానంలో పసలేదని, మంజునాథ కమిషన్ నివేదిక ఇవ్వకముందే హడావుడిగా నివేదికను కేంద్రానికి పంపారని, కావాలనే రిజర్వేషన్లు రాకుండా చేస్తున్నారని జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై వైసీపీ కాకినాడ పార్లమెంటరీ పార్టీ నేత కురసాల కన్నబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు కాపులను మోసంచేశారని విమర్శించారు. ఇది చంద్రబాబు తెలిసి చేసిన మోసమన్నారు. ఎటువంటి శాస్ర్తియత, నిబద్ధత లేకుండా తొలి దశలోనే నివేదికను తిప్పిపంపే రీతిలో వ్యవహరించారన్నారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వివాదాస్పద రీతిలో నివేదికను పంపిందన్నారు. మంజునాథ కమిషన్ ఛైర్మన్ నివేదిక సమర్పించకుండానే నివేదిక వివరాలను సేకరించి, కేంద్రానికి పంపినట్టు చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సున్నితమైన కాపు రిజర్వేషన్ల సమస్యపై కేంద్రాన్ని కనీసం అభ్యర్థించకుండా, నిబంధనలకు విరుద్ధంగా, పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని కన్నబాబు వ్యాఖ్యానించారు.