ఆంధ్రప్రదేశ్‌

గ్రామీణ ప్రజల ఆదాయం పెరిగేలా బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 15: గ్రామీణ ప్రజల తలసరి ఆదాయం పెరిగే విధంగా బడ్జెట్ రూపొందించాలని అధికారులకు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. సచివాలయంలో గురువారం ఉదయం వ్యవసాయం దాని అనుబంధ శాఖలు, మార్కెటింగ్, పశుసంవర్ధక, సహకార శాఖలు, మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల బడ్జెట్ ప్రతిపాదనలను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి యనమల మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని, వ్యవసాయం అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం, పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడి గ్రామీణ ప్రజల ఆదాయం పెరగాలన్నారు. ప్రాథమిక రంగమైన వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సమ్మిళిత అభివృద్ధి సాధించే విధంగా బడ్జెట్ కేటాయింపులు జరగాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి వచ్చే నిధులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ వాటాకు అన్ని శాఖల వారు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే ఇంటింటికి టీడీపీ, జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులకు, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. చాలా శాఖల వారు ఇచ్చిన బడ్జెట్ ఖర్చు చేయకుండా అదనపు బడ్జెట్ అడగటం మొదలుపెట్టారని, ఇది బడ్జెట్ మేనేజ్‌మెంట్‌కు విరుద్ధమని పేర్కొన్నారు. ముందు ఇచ్చినది ఖర్చు చేసిన తరువాత అదనపు బడ్జెట్ అడిగితే ఇస్తామన్నారు. ఎస్సీల భూమి కొనుగోలు పథకానికి తగినన్ని నిధులు కేటాయించాలని సూచించారు. వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోరారు. పౌరులు ప్రభుత్వానికి చెల్లించవలసిన చెల్లింపులన్నిటినీ ఆన్‌లైన్, నగదు రూపంలో చెల్లించే నూతన సాఫ్ట్‌వేర్‌ను ప్రణాళికా శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి చూపించారు. రైతు రుణమాఫీ, రైతు రథం పథకం ద్వారా ట్రాక్టర్ల పంపిణీ, వ్యవసాయ రంగంలో ఖర్చులు తగ్గించవలసిన అవసరం, రొయ్యల చెరువులు, పాడి పశువులు, గొర్రెల కొనుగోలు, వ్యవసాయంలో యాంత్రీకరణ, పట్టణీకరణ, కౌలు రైతులకు రుణాలు, ప్రకృతి వ్యవసాయం, సూక్ష్మ నీటిపారుదల, భోట్లకు డీజిల్ ఆయిల్ సబ్సిడీ తదితర అంశాలను చర్చించారు.