ఆంధ్రప్రదేశ్‌

శాస్ర్తియత లేకపోతే మార్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 17: రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందంటున్నారు. శాస్ర్తియత లేకపోతే ఎందుకు మార్పులు చేయలేకపోయారు. చిత్తశుద్ధి ఉంటే మార్చేందుకు ముందుకు రండి.. మద్దతిస్తాం. అంటూ కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో విభజన చట్టం-హామీలు-అమలు అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. జైరాం రమేష్ మాట్లాడుతూ విభజన చట్టంలో శాస్ర్తియత లేదని, అందుకే ఆంధ్రరాష్ట్రానికి మేలు జరగలేదని అంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో ఉండి కూడా నాలుగేళ్లుగా ఎందుకు ఆ చట్టాన్ని మార్చడానికి ప్రయత్నించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆంధ్రరాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టం మార్పుకు సిద్ధపడితే పార్లమెంటులోనూ, రాజ్యసభలోనూ మద్దతివ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రాన్ని పూర్తిస్థాయి శాస్ర్తియతతో విభజించామన్నారు. ఈక్రమంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పార్లమెంటులో విస్పష్టంగా తెలియజేశారన్నారు. చట్టంలో పొందుపరిచిన హామీలను కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ అమలుచేసి ఉంటే కడప, విశాఖపట్టణం, విజయవాడ, అమరావతి, గుంటూరు ప్రాంతాలు ఇప్పటికే అభివృద్ధి జరిగి ఉండాలన్నారు. అంతేకాకుండా రాయలసీమ జిల్లాల్లోని 4 జిల్లాలకు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరాలకు ప్రత్యేక ప్యాకేజీలు కూడా అంది ఉండాలన్నారు.
తిరుపతిని అభివృద్ధి పరచడంలో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ సైన్స్‌రీసెర్చ్ కేంద్రాలు, అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు కూడా నాడు చట్టంలో పొందుపరిచామన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరుపతిలో వేస్తున్న శిలాఫలకాలు తాము చట్టంలో పొందుపరిచిన అంశాలను అమలులో భాగం మాత్రమే అన్నారు. ఇందుకు సంబంధించి నాడే నిధులు కూడా కేటాయించామన్నారు. సొమ్మొకరిది.. సోకొకరిది అన్న చందాన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించి ఆ నిర్మాణాలకు సంబంధించి పూర్తిగా కేంద్రమే బాధ్యత తీసుకోవాలని చట్టంలో పొందుపరిచామన్నారు. అయితే నేడు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇచ్చారని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు కావాల్సిన వారికి కాంట్రాక్ట్ పనులను అప్పగించి వేలకోట్లు దోచుకోవడానికి ప్రధాని మోదీని ఒప్పించి పనులు చేపడుతున్నారన్నారు. అయినప్పటికీ ఇంతవరకూ పోలవరం ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగుతున్న దాఖలాలు లేవన్నారు. అందుకు కారణం అవినీతి రాజ్యమేలు తుండటంతో నిధులు దుర్వినియోగం అవుతాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్లు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, రాష్ట్రంలో బీజేపీ మిత్రపక్షమైన టీడీపీ అధికారంలో ఉందన్నారు. అలాంటపుడు విభజన చట్టం హామీలను అమలుచేయించుకోవడంలో ముఖ్యమంత్రికి ఎందుకు చేతకావడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు హామీల చట్టం అమలుకు ఏనాడూ చిత్తశుద్ధితో ప్రయత్నించిన దాఖలాలు కనబడలేదన్నారు.