ఆంధ్రప్రదేశ్‌

గామన్‌పై భారీ వాహనాల నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 17: పశ్చిమ గోదావరి జిల్లా గుండుగొలను-కొవ్వూరు రోడ్డు భారీ వాహనాలతో అధ్వాన్నంగా తయారు కావడంతో నిత్యం ఏదో ప్రమాదం జరుగుతూ రక్తమోడుతోంది. నెలకు సుమారు 25 ప్రాణాల వరకు ఈ రోడ్డుపై జరిగే ప్రమాదాల్లో చనిపోతున్నారు. దీంతో ప్రజలు రోజుల తరబడి రహదారిని దిగ్బంధిస్తూ ఆందోళనకు దిగడం, సమస్యను పరిష్కరించడం అధికార యంత్రాంగానికి తలకుమించిన భారంగా మారింది. ఈ నేపధ్యంలో రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ ఆధ్వర్యంలో స్థానిక గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చొరవతో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె. భాష్కర్, కార్తికేయ మిశ్రా, ఉభయ గోదావరి జిల్లాల ఎస్పీలు టి రవిప్రకాష్, బి రాజకుమారి, జాతీయ రహదారుల అధారిటీ అధికారులు, గామన్ వంతెన అధికారులు శనివారం రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో సమావేశమై గుండుగొలను కొవ్వూరు రోడ్డులో ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు చేశారు. గామన్ వంతెనపై దివాన్‌చెరువు జంక్షన్ నుంచి రాత్రి పూట భారీ వాహనాలు పశ్చిమ గోదావరి జిల్లా వైపు వెళ్లకుండా ట్రాఫిక్‌ను ఎన్‌హెచ్ 16 వైపు మళ్లించారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు గామన్ వంతెనపై నుంచి భారీ వాహనాలను మళ్లించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ విధానాన్ని తక్షణం అమల్లోకి వచ్చే విధంగా నిర్ణయించారు.
దీనితో పాటు ప్రమాదాల నివారణకు అవసరమైన చోట్ల స్పీడు బ్రేకర్ల నిర్మించడం, 24 గంటల పాటు ట్రాఫిక్ నియంత్రణకు ఉభయ గోదావరి జిల్లాల్లో అదనపు ట్రాక్ సిబ్బంధిని, పోలీసు అధికారులను నియమించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సమస్యంతా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అదనపు పోలీసు అధికారుల కోసం హోం మంత్రి అంగీకారాన్ని కూడా తీసుకుంటామని, తక్షణం డి ఐజీతో చర్చించి అదనపు ట్రాఫిక్ సిబ్బంది కోసం కృషి చేస్తామని ఎంపీ మాగంటి మురళీమోహన్ చెప్పారు. ఇటీవ కాలంలో గుండుగొలను, కొవ్వూరు మధ్య 418 ప్రమాదాలు జరిగితే అందులో 349 మంది గాయాలపాలయ్యారని, 203 మంది మృతి చెందారని ఎస్పీ రవి ప్రకాష్ చెప్పారు. ప్రస్తుతం గుండుగొలను, కొవ్వూరు రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించేంత వరకు ట్రాఫిక్‌ను నిలుపుదల చేయాల్సిందేనని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భాస్కర్ ఆదేశించారు. గామన్ వంతెన నుంచి రాత్రి పూట భారీ వాహనాలు వెళ్లకుండా తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా నిర్ణయించారు. గుండుగొలను కొవ్వూరు రోడ్డును నాలుగులేన్ల రోడ్డుగా రూ.1530 కోట్లతో నిర్మాణానికి టెండర్లను పూర్తి చేశామని, 30 నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి కానుందని, అంత వరకు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని ఎంపీ మాగంటి మురళీమోహన్ చెప్పారు. ప్రమాదాలు జరగకుండా, ప్రాణనష్టం లేకుండా ఈ చర్యలు చేపట్టినట్టు అర్బన్ ఎస్పీ రాజకుమారి చెప్పారు.