ఆంధ్రప్రదేశ్‌

అనర్హత ఫిర్యాదులు బుట్ట దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహార శైలి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, అధికార పార్టీకి, ప్రభుత్వానికి దాసోహం అన్న రీతిలో స్పీకర్ పనిచేస్తున్నారంటూ వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. విశాఖ వైసీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నుంచి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ తాము ఇచ్చిన ఫిర్యాదుపై నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తూ అనైతికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున 67 మంది ఎమ్మెల్యేలు గెలుపొందితే వారిలో 23 మందిని టీడీపీ ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకోవడమే కాకుండా, కొంతమందికి మంత్రి పదవులిచ్చిందన్నారు. ఈ అనైతిక చర్యపై తాము స్పీకర్‌కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైసీపీని దొంగదెబ్బతీసేందుకు టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మిగిలిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో ఇద్దరు మంత్రులు కిమిడి కళావెంకటరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, రాయలసీమకు చెందిన రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, గుంటూరు ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ ఎమ్మెల్యేల కొనుగోలులో కీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇక ప్రజలకు సేవలందించాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో కొంతమంది టీడీపీ సేవలో తరిస్తున్నారన ధ్వజమెత్తారు.
అధికారం ఉందికదాని వీరంతా టీడీపీ భజన చేస్తున్నారని, మరో ఏడాది కాలం ఆగితే వైసీపీ అధికారంలోకి వస్తుందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యమని, అప్పుడు వీరి సంగతి తేలుస్తామని హెచ్చరించారు. కేంద్రంలో నాలుగేళ్లుగా బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, రాష్ట్రానికి ఏమీ సాధించలేని టీడీపీ ఎంపీలు చివరి బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపుల్లేవంటూ ఆందోళనకు దిగడం డ్రామాగా అభివర్ణించారు. లక్షల కోట్లు పెట్టుబడుల వరద పారుతోంటే ఇక రాష్ట్రానికి తామిచ్చేదేమీ లేదని కేంద్రం భావిస్తోందేమోనన్నారు. అబద్దాలు, అసత్యాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన కొనసాగిస్తున్నారని, ప్రజలు గుర్తించే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.
రాజ్యసభ అభ్యర్థిగా వేంరెడ్డి ప్రభాకర రెడ్డి
త్వరలో జరగనున్న రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైసీపీ తరఫున వేంరెడ్డి ప్రభాకర రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు విజయసాయి రెడ్డి ప్రకటించారు. అనంతరం రాజ్యసభ అభ్యర్థి ప్రభాకర రెడ్డిని ఘనంగా సత్కరించారు. సమావేశంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, విశాఖ జిల్లా పార్టీ ప్రతినిధులు మళ్ల విజయ్ ప్రసాద్, తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నాథ్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి