ఆంధ్రప్రదేశ్‌

రమేష్ హాస్పిటల్స్‌కు జాతీయ స్థాయి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: విజయవాడ, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న రమేష్ హాస్పిటల్‌కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా సంస్థ ‘పేషెంట్ ఫ్రెండ్లీ’ విభాగంలో రమేష్ హాస్పిటల్స్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రకటించింది. అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా ఏటా దేశవ్యాప్తంగా అత్యున్నత సేవలందించే ఆస్పత్రులను గుర్తించి వివిధ విభాగాల్లో అవార్డులను ప్రకటిస్తుంది. ఈ ఏడాది రమేష్ హాస్పిటల్‌కు పేషెంట్ ఫ్రెండ్లీ అవార్డును ప్రకటించింది. అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా సంస్థ శుక్రవారం కేరళలో ఓ హోటల్‌లో నిర్వహించిన సదస్సులో కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె చేతుల మీదుగా రమేష్ హాస్పిటల్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్లు పొట్లూరి గోపీకృష్ణ, డాక్టర్ రాయపాటి మమత పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ రమేష్ మాట్లాడుతూ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మధ్యకాలంలో పేషెంట్ సెంట్రిక్ కేటగిరిలో ఫిక్కీ ద్వారా అవార్డును, ఆసియన్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సంస్థ ద్వారా ఇన్నోవేషన్ ఇన్ హెల్త్ కేర్ టెక్నాలజీ ప్రాజెక్టులలో ఎక్స్‌లెన్స్ అవార్డు అందుకున్నామని గుర్తు చేశారు.