ఆంధ్రప్రదేశ్‌

విమానాశ్రయం విస్తరణకు భూములు ఇచ్చిన రైతులకు రాజధానిలో ప్లాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 17: గన్నవరం విమానాశ్రయం విస్తరణ కోసం ఏలూరు కాలువ మళ్లింపు నిమిత్తం భూములు ఇచ్చిన రైతులకు సీఆర్‌డీఏ పరిధిలో ప్లాట్స్ ఇచ్చేవిధంగా తగు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్, కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, ఎయిర్‌పోర్టు, రెవెన్యూ, ఆర్ అండ్ బి, సీఆర్‌డీఏ అధికారులతో భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై శనివారం కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ గన్నవరం విమానాశ్రయం విస్తరణకు కావలసిన 27 ఎకరాల భూములకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి పంపనున్నామన్నారు. విస్తరణలో భాగంగా ఇప్పటికే వెంచర్‌లు వేసుకున్న వారికి గ్రామంలో వేరే ప్రాంతంలో స్థలాలు ఇచ్చే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు. రైతులకు నష్టం జరగకుండా, వారికి అనుకూలంగా అన్ని చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో నూజివీడు ఆర్డీవో సిహెచ్ రంగయ్య, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు, గన్నవరం తహశీల్దార్ మాధురి ఇతర అధికారులు పాల్గొన్నారు.