ఆంధ్రప్రదేశ్‌

ఎవరి పరిధిలో వారుండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 17: మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి పరిథిలో వారుండాలని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించారు. వైసీపీ మూలంగా రాష్ట్రంలో ఎదురవుతున్న సమస్యలను గ్రామ స్థాయిలో ప్రచారం చేయడంతోపాటు, ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. శనివారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లా పార్టీ నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరి నియోజకవర్గాల్లో వారే పనిచేసుకోవాలని, ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. ఇన్చార్జి మంత్రులు ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలని, జిల్లాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి వస్తే సమష్టిగా చర్చించి తీసుకోవాలన్నారు. జిల్లాల్లో ఎమ్మెల్యేలు, కార్యకర్తల మధ్య దూరం పెరిగిన నియోజకవర్గాలను గుర్తించి ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చాలని, అవసరమైతే తానూ జోక్యం చేసుకుంటానన్నారు. ఎక్కడైతే ఎమ్మెల్యే పనిచేయడం లేదో, కార్యకర్తలను సమన్వయం చేసుకోవడం లేదో ఆ నియోజవకర్గాలపై దృష్టి సారించాలన్నారు. కార్యకర్తల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ఇన్చార్జి మంత్రులు చొరవ చూపాలన్నారు. సమన్వయంతోనే ఎన్నికల్లో విజయం సాధ్యమని, ఎవరూ అత్యుత్సాహం, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వెళ్లవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయని, ప్రభుత్వ పథకాల్లో ప్రజల సంతృప్తి శాతం ఎప్పటికప్పుడు పెరుగుతోందని, దానిని ఓటుగా మలచుకునే బాధ్యత మీదేనని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, మంత్రులు పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజరయ్యారు.