ఆంధ్రప్రదేశ్‌

ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 19: రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్లో మొండిచేయి చూపిస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన స్వరాన్ని మరింత కఠినతరంగా మారుస్తున్నారు. ఎవరి దయాధర్మం అవసరం లేదంటూ పరోక్షంగా కేంద్రాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మన రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలి. ప్రజాప్రతినిధుల పోరాటం, అధికార యంత్రాంగం కృషి రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. సోమవారం తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి, వ్యవసాయం’ పురోగతిపై జరిగిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘ఎవరి దయాదాక్షిణ్యాలతో మనకు పనిలేదు. మన సామర్థ్యమే మనకు శ్రీరామరక్ష. ప్రతి ఒక్కరూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలి. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. మన కష్టమే మనకు అక్కరకు వస్తుంది. సంక్షోభంలో మరింత సామర్థ్యంతో పనిచేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ పాటుబడాలని’ చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. మన రాష్ట్రావతరణను ఒక వేడుకగా కాకుండా ఒక సంకల్పంగా, ఒక దీక్షగా తీసుకుని కసిగా పని చేస్తున్నామనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. నవ నిర్మాణ దీక్ష, మహా సంకల్పం నేపథ్యాలను స్ఫురణకు తెచ్చుకోవాలన్నారు. ‘మార్కెట్ జోక్యం కోసం మరింత పటిష్ఠమైన వ్యవస్థ తీసుకురావాలి. ప్రతి రైతుకు లాభదాయకమైన ధర లభించే వ్యవస్థ రావాలి. గతం కన్నా కౌలు రైతులకు పంట రుణాలు నాలుగైదు రెట్లు అధికంగా ఇచ్చాం. కౌలు రైతుల్లో పూర్తి సంతృప్తి ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పటివరకు 78 శాతం పంట రుణాలే ఇచ్చారు. రుణాల లక్ష్యం 100 శాతానికి చేరుకోవాలని’ అన్నారు. రాష్ట్రంలో పంటలకు ఏ విధమైన తెగుళ్లు సోకకుండా పరిశోధనలు చేయాలన్నారు. పండ్ల తోటల సాగు ఎంత పెరిగితే అంత లాభం అంటూ, కోటి ఎకరాల్లో ఉద్యాన సేద్యం జరగాలనేది మన లక్ష్యంగా వివరించారు. సూక్ష్మసేద్యం లక్ష్యం 68 శాతం మాత్రమే చేరుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జలసంరక్షణ ఉద్యమం రెండవ దశ పనులు ముమ్మరం చేయాలని, చెరువుల పూడికతీత, ముళ్ల కంపల నరికివేత వేగవంతం చేయాలని ఆదేశించారు. మనం ఎక్కడ ఉన్నాం, ఎంత సాధించాం, ఇంకా ఎంత సాధించాలనేది ఎప్పటికప్పుడు విశే్లషించుకోవాలన్నారు. పశుగ్రాసం, సైలేస్, గ్రీన్ పౌడర్, డీఎంఆర్ పంపిణీ చేయాలని, పాల ఉత్పాదకత పడిపోకుండా చూడాలని సూచించారు. పశుగణాభివృద్ధి రంగంలో వృద్ధి ప్రస్తుత లక్ష్యం 15 శాతంలో 12.5 శాతం మాత్రమే సాధించామంటూ, 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.
నిధులు నిలిపివేసే అవకాశం ఇవ్వరాదు
‘రాబోయే 45 రోజులు నరేగా పనులు ముమ్మరం కావాలి. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి, గ్రామాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంపొందాలి. ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలి. ప్రతి పని జియో ట్యాగింగ్ చేయాలి. అన్నింటినీ ఆన్‌లైన్‌లో పెట్టాలి, పూర్తి పారదర్శకంగా చేయాలి. ఏదో ఒక నెపంతోనో, ఎవరో ఒకరి ఫిర్యాదుతోనో నిధులు నిలిపివేసే అవకాశం మనం ఇవ్వరాదని’ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం ముమ్మరం చేయాలని, హౌసింగ్‌లో అన్ని జిల్లాలు ఏ గ్రేడ్ చేరుకోవాలని ఆదేశించారు. 2017-18, 2018-19 ఇళ్ల కేటాయింపులు వెంటనే పూర్తిచేయాలన్నారు.

నాకేమీ భేషజాలు లేవు
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ప్యాకేజీ, తదితర అంశాలపై పోరాడుతున్న అఖిల పక్ష పార్టీలు, సంస్థలు, వ్యక్తులతో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి టీడీపీ నేతలతో ఆయన సోమవారం టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ జనసేన నేత పవన్ కళ్యాణ్, సీపీఎం, సీపీఐ, చలసాని, శివాజీ తదితర పోరాడుతున్న వారితో కలిసి పని చేసేందుకు తనకెటువంటి భేషజాలు లేవన్నారు. రాష్ట్భ్రావృద్ధే తన ధ్యేయమన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ అవిశ్వాస సవాల్‌ను చర్చించారు. అవిశ్వాసం ప్రవేశపెట్టడం సులభేకానీ, అవిశ్వాసం ప్రతిపాదించడానికి 58 మంది సభ్యుల బలం ఉండాలని గుర్తు చేశారు. తగినంత సంఖ్యాబలం లేకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. మన రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నాం తప్ప, స్వప్రయోజనాల కోసం కాదని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా వివరించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను అనేకసార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను స్వయంగా తాను ఫైళ్లను మోసుకువెళ్లి కూడా కలిశానని గుర్తు చేశారు.