ఆంధ్రప్రదేశ్‌

హోంగార్డుల వేతనాల పెంపునకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్రంలో హోంగార్డుల వేతనాల పెంపుదలకు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అంగీకారం తెలిపారు. భూగర్భ, అటవీ శాఖల్లో బినామీ వ్యవస్థకు అడ్టుకట్టవేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనలపై హోం, విద్యుత్, రెవెన్యూ, అటవీ, ఎక్సైజ్, దేవదాయ, ధర్మదాయ, కమర్షియల్ శాఖల అధికారులతో సచివాలయంలోని తన కార్యాలయంలో ఆయన సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డుల జీతాలు పెంచాలని రాష్ట్ర డీజీపీ ఎం మాలకొండయ్య, హోం శాఖ ముఖ్య కార్యదర్శి అనూరాధ కోరగా, ఇందుకు ఆర్థికమంత్రి అంగీకారం తెలిపారు. ఎంత మేర పెంచాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో నిర్మించతలపెట్టిన ఫోరెనిక్స్ ల్యాబ్, జిల్లా స్థాయిల్లో జైళ్ల భవనాల నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. మిగిలిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాలని సంబంధిత అధికారులకు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. పెరిగిన డీజిల్ ధరల నేపథ్యంలో నిధులు కేటాయించాలని డీజీపీ మాలకొండయ్య కోరారు. విశాఖపట్నంలో పోలీసు స్టేషన్ల భవన నిర్మాణాలు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని మంత్రిని కోరారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్, ఇంటెలిజెంట్ విభాగాలకు రాబోయే బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని సంబంధిత అధికారులు కోరారు. ఏపీ జెన్‌కో పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 1500 కోట్ల మేర నష్టాలు తగ్గించుకోగలిగామని జెన్‌కో జేఎం డీ దినేష్ పర్చూరి, ఆర్థిక మంత్రికి తెలిపారు. వ్యవసాయానికి అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు రీయింబర్స్‌మెంట్ చేయాలని ఆర్థిక మంత్రిని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు కోరారు. స్థానిక సంస్థల ద్వారా రావాల్సిన విద్యుత్ బకాయిల వివరాలను కూడా వివరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 90కోట్లు కేటాయించాలని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కోరారు. రెవెన్యూ శాఖలో ఖాళీ సర్వేయర్ పోస్టుల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో రిటైర్డ్ సర్వేయర్లతో పాటు ఇతరులను తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు యనమల ఆదేశించారు. అవసరానికి మించి జరుగుతున్న ఖర్చుకు అడ్డుకట్ట వేయాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశించిన ఆదాయ అర్జనలో అటవీ శాఖ వెనుకబడి ఉండడంపై ఆ శాఖాధికారులను యనమల ప్రశ్నించారు. అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు జోరుగా సాగుతోందని దాన్ని అరికట్టాలని ఆదేశించారు. అటవీ ఉత్పత్తులు గిరిజనులకే చెందాలని స్పష్టం చేశారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అటవీ శాఖ పరిధిలో 2 లక్షల హెక్టార్లలో పచ్చదనం పెరిగినట్లు మంత్రికి ఆ శాఖాధికారులు వివరించారు. నిర్దేశించిన లక్ష్యం కంటే అధికంగా ఆదాయం సమకూర్చిన ఎక్సైజ్ శాఖ పని తీరును యనమల అభినందించారు. ఎక్సైజ్ పోలీసు స్టేషన్లలో వౌలిక సదుపాయల కల్పన, వాహనాల కొనుగోలుకు నిధులు కేటాయించాలన్న ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ లక్ష్మీ నృసింహ కోరగా అంగీకారం తెలిపారు. భూగర్భ, గనుల శాఖ ప్రస్తుత ఏడాదిలో లక్ష్యానికి మించి 15 శాతం మేర ఆదాయం సాధించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు.