ఆంధ్రప్రదేశ్‌

హోదా కోసం అవిశ్వాసానికి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేంద్రంపై అవిశ్వాసానికి భావసారూప్య పార్టీలు ఎవరి మద్దతైనా తాము తీసుకోగలమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. అయితే కేంద్రంపై అవిశ్వాసం అనేది అనుభవజ్ఞుడైన చంద్రబాబు పెడితేనే బాగుంటుందని, రాష్ట్ర ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారధితో కలిసి ఆయన మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే తమకు తెలిసిన వివరాల ప్రకారం 54 మంది ఎంపీల అవసరం ఉందని అన్నారు.
తమ పార్టీకి 9మంది ఎంపీలు ఉండాల్సి ఉండగా నలుగురిని చంద్రబాబు కొనుగోలు చేయడంతో ఇప్పుడు ఐదుగురు మాత్రమే మిగిలారని తెలిపారు. బాబు వద్ద 20 మంది ఎంపీలు ఉన్నారు కనుక ఆయన రాష్ట్రం కోసం అవిశ్వాసాన్ని పెడితే బాగుంటుందని అన్నారు. జగన్‌మోహన్ రెడ్డి సూచించిన విధంగా చంద్రబాబును జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవిశ్వాసానికి ఒప్పించాలని డిమాండ్ చేశారు. అవిశ్వాసం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఆయన ప్రకటించడం దారుణమని అన్నారు. ప్రత్యేక హోదా అనేది కొత్త డిమాండ్ కాదని నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు కలిసి తిరుపతిలో 15ఏళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకుంటే మంచిదని అన్నారు. బాబు తీరు చూస్తే నరేంద్రమోదీకి భయపడుతున్నట్టుగా ఉందని అన్నారు. అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ పెడుతోందనే వార్తలను గురించి ఓ విలేఖరి ప్రస్తావించగా కాంగ్రెస్సే కాదని హోదాపై పోరాటానికి ఎవరి మద్దతైనా తీసుకుంటామన్నారు. పార్లమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదని తీర్మానానికి సంఖ్యాబలం అవసరమని తెలిపారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కేంద్రం వ్యవహరించాలని చంద్రబాబు అంటున్నారని కాని ఆయన మనస్సు చూస్తే కేంద్రం మనోభావాలు దెబ్బతినకుండా ప్రజలు ఆలోచించాలని అన్నట్లుగా ఉందని అన్నారు. నిన్నటి వరకు జగన్‌పై కేసులు ఉన్నాయని రాజీనామాల డ్రామా ఆడుతున్నారని దుష్ప్రచారం చేశారని, నిజానికి డ్రామాలు ఆడుతుంది చంద్రబాబు అండ్ కో నేనని అన్నారు.