ఆంధ్రప్రదేశ్‌

ప్రవాసాంధ్రులకు కువైట్ క్షమాభిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: కువైట్ నుండి ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ద్వారా 5వేల మంది రాష్ట్రానికి రానున్నారని, తిరిగి వచ్చిన ప్రవాసులకు సహాయ సహకారాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర న్యాయ, యువజన, క్రీడలు, ప్రవాసాంధ్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వెలగపూడి సచివాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాను, శాఖ అధికారులు కువైట్ వెళ్తున్నామన్నారు. మూడురోజులపాటు దుబాయ్‌లో ఉండి మిగిలిపోయిన వారికి తక్షణ సహాయం అందించి తిరిగి స్వదేశానికి తీసుకువస్తామని తెలిపారు. కువైట్ ప్రభుత్వ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష)తో వస్తున్నవారిలో అధిక శాతం కడప, ఉభయగోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన చిరు ఉద్యోగులు ఉన్నారని వివరించారు. జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లి, అక్కడ చిన్నా చితకా ఉద్యోగులు చేసుకుంటూ అక్కడి చట్టాలు తెలియక, జరిమానాలు కట్టలేక కువైట్‌లో అనధికారికంగా బతుకుతున్న ప్రవాసులు ఎటువంటి అపరాధ రుసుములు చెల్లించకుండా స్వదేశానికి వెళ్లవచ్చునంటూ ఆమ్నెస్టీ ప్రకటనను జారీచేసిందన్నారు. కువైట్ ప్రభుత్వ ప్రకటనను వినియోగించుకుని వేలాది మంది ప్రవాసులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారని తెలిపారు. తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు దుబాయ్‌లో ఉన్నవారిని ఆదుకోవలసిందిగా లేఖ రాశారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రానందున కేవలం మూడు రోజుల ఆమ్నెస్టీ గడువు ఉండటంతో అధికారులు కువైట్‌కు వెళ్లి తక్షణం ఆదుకోవలసిందిగా ఆదేశించారన్నారు. ఆమ్నెస్టీతో కువైట్ నుండి తిరిగి వచ్చిన ప్రవాసాంధ్రులకు తక్షణ వెసులుబాటు కార్యక్రమాలు చేపట్టమని ఏపీఎన్నార్టీకి ఆదేశాలు జారీ చేశామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం తాను, తన శాఖ అధికారులు ఫిబ్రవరి 19 రాత్రి బయలుదేరి కువైట్‌కు 20వ తేదీ చేరుకుని రెండు రోజులపాటు అక్కడే ఉండి, కువైట్‌లో మిగిలిపోయిన తెలుగువారికి అవసరమైన చేయూతనిస్తారని మంత్రి తెలిపారు.కువైట్ నుండి తిరిగి వచ్చిన ప్రవాసాంధ్రులు మరిన్ని వివరాల కోసం, రిజిస్ట్రేషన్ కొరకు ఏపీ ఎన్నార్టీ హెల్ప్‌లైన్ నంబర్ 0091863-2340678కు ఫోన్ ద్వారా, 009185000 27678 నంబర్‌కు వాట్సప్ ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు. ఏపీఎన్నార్టీ ప్రెసిడెంట్ డాక్టర్ రవికుమార్ వేమూరు, డైరక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రభూమి బ్యూరో