ఆంధ్రప్రదేశ్‌

అన్ని పంటలకూ గిట్టుబాటు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 19 : తమ పార్టీ అధికారాన్ని చేపట్టగానే అన్ని పంటలకు తప్పని సరిగ్గా గిట్టుబాటు ధరలు కల్పిస్తామని వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రైతులకు భరోసా కల్పించారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 92వ రోజు సోమవారం ప్రకాశం జిల్లా కందుకూరు శివారున శిబిరం నుండి ప్రారంభమై వెంకటాద్రి పాలెం, అనంతసాగరం క్రాస్‌రోడ్డు, ఎడ్లూరుపాడు కాలనీ, పెద వెంకన్నపాలెం మీదుగా విప్పగుంట్ల వరకు కొనసాగింది. ఎడ్లూరు పాడు వద్ద కొండేపి నియోజక వర్గంలో ప్రవేశించిన జగన్ అక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆదివారం సాయంత్రానికి 1234.9 కిలో మీటర్లు నడిచిన జగన్ సోమవారం మరో 14 కిలో మీటర్లు నడిచి మొత్తం 1248.9 కిలో మీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. కందుకూరు శివారులో పెద్ద సంఖ్యలో ప్రజలు జగన్‌కు సంఘీభావం తెలిపారు. కందుకూరు నుండి వచ్చిన పలువురు ముస్లిం మహిళలు కూడా జగన్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పెన్షన్లు రావడం లేదని , తమ పిల్లలకు మరింత ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా రిజర్వేషన్లు పెంచాలని ముస్లీం మహిళలు విజ్ఞప్తి చేశారు. వెంకటాద్రిపాలెం లో స్థానిక జామాయిల్ రైతులు తమ సమస్యను జగన్ దృష్టికి తీసుకువచ్చారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర రావడం లేదని తెలిపారు. గతంలో 4 వేల 200 రూపాయలు పలికిన ధర 1800 రూపాయలకు పడిపోయిందని జామాయిల్ రైతులు తెలిపారు. వారి సమస్యలను సావధానంగా విన్న జగన్ పార్టీ అధికారంలోకి రాగానే తగిన విధంగా న్యాయం చేస్తామని తెలిపారు. కొల్లగుంట, బడేవారిపాలెం, ఎడ్లూరుపాడుకు చెందిన పలువురు రైతులు తమ సమస్యలను జగన్ కు వివరించారు. దీనిపై స్పందించిన జగన్ తాను అధికారంలోకి రాగానే సాగు దారులకే భూములపై హక్కులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.