ఆంధ్రప్రదేశ్‌

బీజేపీతో లెక్క తేల్చేందుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 19: బీజేపీతో లెక్కలు తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పితాని సత్యన్నారాయణ వెల్లడించారు. తానూ లెక్కలు చదువుకున్నానని..తనకూ లెక్కలు వచ్చని..మార్చి 5లోగా ఏ లెక్కలు చెబుతారో చెప్పండంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. తర్వాత పొత్తులు ఉండాలో, లేదో అసలు లెక్కలు తేల్చేందుకు సంసిద్ధంగానే ఉన్నామన్నారు. సోమవారం ఇక్కడ టీడీపీ జిల్లా నియోజకవర్గాలవారీ విస్తృతస్థాయి సమావేశాలు ఆరంభమయ్యాయి. ఈ సమావేశాలకు హాజరైన ఇన్‌ఛార్జి మంత్రి మీడియాతో మాట్లాడారు. మిత్రపక్షంగా పోటీ చేసినందునే టీడీపీ - బీజేపీలను ప్రజలు ఆదరించాలని, విభజన చట్టంలో ఉన్నవన్నీ ఇస్తామని చెప్పినందునే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు. ఆ ప్యాకేజీ కింద ఎంత ఇచ్చారో బీజేపీ నేతలే సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు ఇచ్చినట్లే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా చేపట్టే సంక్షేమ పథకాలకు నిధులు ఇచ్చారన్నారు. ఎన్నికల ముందు ఆఖరి బడ్జెట్ కాబట్టే మేం నోరువిప్పాల్సి వచ్చిందని, మిత్రపక్షంగా ఉండి ప్రతిపక్షపార్టీలా పోరాడాల్సిన దుస్థితి రావడం బాధాకరమన్నారు. ఇక బీజేపీ నేతల్లా బరితెగించి తామూ మాట్లాడగలమని, కానీ ఇంకా సంయమనం పాటిస్తున్నామన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలి కాబట్టే ఆత్మపరిశీలన చేసుకుంటున్నామని పితాని స్పష్టం చేసారు. ప్రస్తుతం మిత్రపక్షంగా ఉండాలా? లేదా? తేల్చుకోవల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. హక్కులు సాధించే పోరాటంలో టీడీపీ ఉందని, సాధించలేనప్పుడు ఏం చేయాలో ఆలోచన చేస్తామన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేందుకు బీజేపీ కూడా క్రీయాశీలక పాత్ర వహించాలని మంత్రి పితాని కోరారు. ఏపీకి న్యాయం చేయండంటూ బీజేపీ నేతలను చేతులు జోడించి వేడుకున్నారు.

చిత్రం..మీడియాతో మాట్లాడుతున్న మంత్రి పితాని సత్యనారాయణ