ఆంధ్రప్రదేశ్‌

హోదాపై చావో రేవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు/నూజివీడు, ఫిబ్రవరి 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ సాధించే వరకు పోరాటం ఆగబోదని, కేంద్రంతో చావో..రేవో తేల్చుకుంటామని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి స్పష్టంచేశారు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, విభజన హామీలు నెరవేర్చాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట, కృష్ణాజిల్లా నూజివీడులో సోమవారం జరిగిన ఆత్మగౌరవ దీక్షల్లో ఆయన మాట్లాడుతూ నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో ప్రత్యేక హోదా ప్రకటించారని, వచ్చేనెల 5వ తేదీతో హోదా గడువు కూడా ముగుస్తుందని తెలిపారు. బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఒకరిపై ఒకరు అభియోగాలు మోపుకుంటూ ప్రజలను మరోసారి వంచించే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాన మంత్రిగా నరేంద్రమోదీ అధికారపగ్గాలు చేపట్టిన తరువాత 5వ రోజునే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఏపీని ఆదుకోవాలని లేఖ రాసినట్లు గుర్తుచేశారు. విభజన హామీలు సవరణల ద్వారా సాధించుకోవాల్సి ఉందన్నారు. సవరణలకు కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. గత కొద్దినెలల క్రితం ప్రత్యేక హోదా డిమాండ్‌తో 14 జాతీయ పార్టీలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహూల్ గాంధీ ఆధ్వర్యంలో గుంటూరులో సభ నిర్వహించినా అప్పట్లో ప్రభుత్వం మేల్కోలేదని విమర్శించారు. విభజన హామీల డిమాండ్‌తో వచ్చేనెల 2వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధనంతో పాటు 6,7,8 తేదీల్లో పార్లమెంటు ముట్టడి నిర్వహిస్తామన్నారు. టీడీపీ, వైసీపీలు కేంద్రంతో లోపాయకారీ ఒప్పందాలు విడనాడి రాష్ట్ర ప్రజల కోసం ఉద్యమించాలని హితవు పలికారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలనే చిత్తశుద్ది ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి మరిన్ని నిధులు వచ్చే విధంగా సవరణలు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలకు నిధులు కేటాయించే విధంగా బడ్జెట్‌లో సవరణలు చేయాలని, మిత్రపక్షంగా ఉన్న టీడీపీ బాధ్యత తీసుకోవాలని కోరారు.

చిత్రం..గుంటూరు కలెక్టరేట్ వద్ద నిరసనదీక్షలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి