ఆంధ్రప్రదేశ్‌

విద్యకు దన్ను.. యువతకు భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: రాబోయే బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యకు, యువతకు పెద్దపీట వేయనుంది. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ఇప్పటికే ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. డ్రాపౌట్స్ నిరోధంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పదో తరగతి వరకూ మధ్యాహ్నం భోజన అమలు చేస్తోంది. పేద విద్యార్థులకు మరింత మేలు కలిగే విధంగా ఉదయం టిఫిన్ అందజేయాలనే ఆలోచన చేస్తోంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకూ మధ్యాహ్నం భోజనం పెట్టాలని భావిస్తోంది. ఇప్పటివరకూ 9వ తరగతి విద్యార్థినులకు బడికొస్తా.. పేరుతో సైకిళ్లు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి విద్యార్థినులకూ సైకిళ్లు అందజేయాలని భావిస్తోంది. యువతకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వీలైనంతవరకూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరికీ భృతి ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. వీలైనంత త్వరగా నిరుద్యోగులకు సంబంధించిన వివరాలు అందజేయాలని సంబంధిత శాఖాధికారులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలోని తన కార్యాలయంలో రాబోయే బడ్జెట్‌లో ప్రతిపాదనలపై హౌసింగ్, విద్య, టూరిజం, యువజన శాఖాధికారులతో సోమవారం మధ్యాహ్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాబోయే బడ్జెట్ యువతకు, విద్యకు, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతివ్వాలని అదికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకూ మధ్యాహ్న భోజన పథకం అమలుపై సాధ్యాసాధ్యాలపై చర్చించారు. పేద విద్యార్థులకు మరింత ఉన్నత చదువులు చదివేందుకు ఆస్కారముంటుందన్న ఉద్దేశంతో ఎంత ఖర్చయినా భరించి, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడానికి మంత్రి అంగీకరించారు. ఇందుకయ్యే వ్యయంపై లెక్కలు తేల్చాలని ఆర్థిక శాఖాధికారులకు మంత్రి ఆదేశించారు. దీనివల్ల రాష్ట్రంలో 34 లక్షలకు పైగా విద్యార్థులకు మేలు కలుగుతుందని విద్యాశాఖాధికారులు తెలిపారు. బాలికా విద్యలో డ్రాపౌట్ల నిరోధానికి, మహిళా అక్షరాస్యత పెంపుదలకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థినులకూ సైకిళ్లు అందజేయాలన్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరికను మన్నిస్తూ రాబోయే బడ్జెట్‌లో అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థికశాఖ అధికారులను యనమల ఆదేశించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలన్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లో ఉన్న గ్రంథాలయాలను పటిష్ఠపర్చాలని, అవసరమైనచోట అవుట్ సోర్సింగ్ పద్ధతిలో లైబ్రేరియన్ పోస్టులను భర్తీచేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. పదో తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీకి మంత్రి అంగీకారం తెలిపారు. టూరిజంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, విజయవాడ భవానీ ఐలాండ్‌లో చిన్నపిల్లలను ఆకర్షించే విధంగా మ్యూజియంలు ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో 3 జిల్లాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయనున్నామని, దీనికి నిధులు కేటాయించాలని అధికారులు కోరడంతో అందుకు మంత్రి అంగీకారం తెలిపారు. ప్రతి గ్రామానికి స్పోర్ట్స్ కిట్ అందజేయాలని, ఇందుకు అవసరమైన నిధులు అందజేస్తామని తెలిపారు. రోడ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు కోరారు. ఇందుకు ఆర్థిక మంత్రి యనమల అంగీకరించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ గ్రామీణ గృహ నిర్మాణశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులను ఆయన అభినందించారు. జర్నలిస్టు హౌసింగ్ పథకానికి నిధులు కేటాయించేందుకు అంగీకారం తెలిపారు.