ఆంధ్రప్రదేశ్‌

కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు, నిధుల విడుదలపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం, అయితే మీరు సిద్ధమేనా అంటూ తెలుగుదేశం పార్టీకి బీజేపీ సవాల్ విసిరింది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి సుధీష్ రాంభొట్ల సోమవారం విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ విడుదల తర్వాత రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై అసంతృప్తి చెందిన తెలుగుదేశం పార్టీ భాజపాపై విమర్శలకు దిగిందని, భాజపా రాష్ట్రానికి అన్యాయం చేసినట్లు ఆరోపిస్తుందని అన్నారు. కేంద్రం ఏ రాష్ట్రానికీ చేయనటువంటి సాయం ఆంధ్రప్రదేశ్‌కు చేస్తోందని ముఖ్యమంత్రి కూడా గతంలో పొగిడి మరల ఇప్పుడు విమర్శించడం సరికాదన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి పూర్తయిన టెండర్లను ఎందుకు ఆపాల్సి వచ్చిందో తెలపాలని మిస్టర్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఎంపీ జయదేవ్ ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు విడుదల చేసిన రెండు నివేదికలను విమర్శిస్తూ తెలుగుదేశం విడుదల చేసిన నివేదికల్లోని అంశాలన్నీ అసత్యాలే అని చెప్పారు. కేంద్రం, రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలుపై తాము తెలుగుదేశం పార్టీతో ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఊహించిన దానికంటే కేంద్రం, రాష్ట్రానికి ఎక్కువే చేసిందని చెప్పారు. కేంద్రాన్ని విమర్శించే ముందు పవన్ కల్యాణ్ తన ఆలోచనను సరి చేసుకుని మాట్లాడాలని సూచించారు.