ఆంధ్రప్రదేశ్‌

అధిష్ఠానానికి రెండు ప్రత్యామ్నాయాలు ఇచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ నేతలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్ఠానానికి రెండు ప్రత్యామ్నాయాలు ఇచ్చామని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. తమ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే, నిమిషంలో రాజీనామాలు చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో సోమవారం మాట్లాడుతూ తమ పార్టీ నేతలకు రెండు ప్రత్యామ్నాయాలు ఇచ్చామని, టీడీపీ తెగతెంపులు చేసుకోక ముందే, తామే బయటకు రావడం లేదా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, రాష్ట్రానికి ఏమి చేశామో ప్రజలకు చెప్పడం ఒక ప్రత్యామ్నాయంగా సూచించామని తెలిపారు. ఒక వేళ పొత్తు కొనసాగే పక్షంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి, కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీతో ఏపీకి ఏమి చేశామో చెప్పించడం మరో ప్రత్యామ్నాయంగా తమ పార్టీ నేతలు భావిస్తున్నారన్నారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లోపే జైట్లీని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. బీజేపీతో టీడీపీ విడిపోయినా కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా నష్టమేమీ ఉండబోదన్నారు. టీడీపీతో పొత్తు తెంచుకునే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. ఒకరు పొత్తు వదులుకుంటే, మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న బీజేపీ నేతలు రాజీనామాలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై స్పందిస్తూ, తమ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే, నిమిషయంలో రాజీనామాలు చేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.