ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ కార్యకర్త కోరిక తీర్చిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: కామవరపుకోటకు చెందిన మహబూబ్ సుభాని తలలో నరం సమస్య వల్ల కదల్లేని పరిస్థితిలో ఉండడంతో తన ఆఖరి కోరికగా సీఎం చంద్రబాబు నాయుడును చూడాలని ఉందని ఏలూరు ఎంపీ మాగంటి బాబుకు చెప్పడంతో ఆయన కారులో పోగొండ రిజర్వాయరు ప్రాంతానికి తీసుకొచ్చారు. ముఖ్యమంత్రికి విషయాన్ని బాబు వివరించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కోరిక తీర్చడానికి చంద్రబాబు అంగీకరించి స్వయంగా కారు దగ్గరకు వెళ్లి పరామర్శించారు. తాను చిన్నప్పటి నుండి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశానని, ఎప్పుడు మరణిస్తానో తెలియని స్థితిలో రాష్ట్భ్రావృద్ధి కోసం పాటుపడుతున్న చంద్రబాబును కడసారి చూడాలన్నదే తన కోరిక అని సుభాని చెప్పారు. మహబూబ్‌ను ఆప్యాయంగా పలకరించి తనవంతు సహకారం అందిస్తానని, ఇలాంటి కార్యకర్తలను రక్షించుకోవడానికి ఎన్టీఆర్ ట్రస్టు నుండి ఆర్థిక చేయూత కూడా అందిస్తున్నామని సీఎం చెప్పారు. తాను సీఎంను చూసి ఎంతో ఆనందపడ్డానని, తన శేష జీవితం ఇంకా ఏమైనా పర్వాలేదని మహబూబ్ చెప్పారు.