ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ, జగన్‌ల మధ్య రహస్య ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: వైకాపా అధినేత జగన్, బీజీపీల మధ్య రహస్య ఒప్పందం జరిగిందని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్, బీజేపీలు ఎన్నడూ విమర్శించుకోని విషయాన్ని గుర్తు చేశారు. జగన్‌ను బీజేపీ నేతలు విమర్శించరని, బీజేపీ నేతలను కూడా జగన్ పల్లెత్తు మాట అనరని ఆరోపించారు. పరస్పరం విమర్శలు చేసుకోకపోవడంతో ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం జరిగినట్లు ఆనుమానం కలుగుతోందన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడతామని జగన్ చెప్పిన తరువాత కూడా బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ మంత్రులు రాజీనామా చేయడం వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. బీజేపీ విషయంలో ఇప్పటికీ తాము మిత్ర ధర్మానే్న పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ నేతలు వాస్తవ పరిస్థితిని కేంద్రానికి తెలపాలని సూచించారు. రాష్ట్భ్రావృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న సీఎం నిర్ణయమే తమకు శిరోధార్యమన్నారు.