ఆంధ్రప్రదేశ్‌

రాజీనామాలు చేస్తే పార్లమెంటులో పోరాడేది ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రంపై ఎంతటి పోరాటానికైనా సిద్దమని, అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకునిపోయి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికైనా వెనుకాడేది లేదని సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అయితే ముందుగా పార్లమెంటులో అన్ని విధాలుగా పోరాడాలని, ఎంపీలు రాజీనామాలు చేస్తే పార్లమెంటులో నిలదీసి ఉద్యమించడానికి ఎవరుంటారని ప్రశ్నించారు. హోదాపై ప్రధాని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తించి బీజేపీ రాష్ట్రానికి న్యాయం చేయాలన్న చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఏపీ ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి అజిత్‌సింగ్‌నగర్‌లోని ఏంబీపీ స్టేడియంలో నిర్వహించిన మాదిగల మహాసభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన పద్ధతి ప్రకారం జరగలేదన్నారు. ఆర్థిక లోటుతో సతమతమవుతున్నా సంక్షేమం, అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా విజయవంతంగా ప్రజలకు అయా పథకాలతో లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. అయితే ప్రత్యేక హోదా, అందుకు సమానమైన ప్యాకేజీలపై గత మూడున్నరేళ్ళుగా ఎదురుచూపులు చూశామని, హోదాపై ప్రధాని హామీ ఇచ్చారని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన హామీలను నిలబెట్టుకుని న్యాయం చేయాలన్నారు. నాడు పార్లమెంటులో విభజన ప్రక్రియలో మద్దతిచ్చి పాల్గొన్న అన్ని పక్షాలు, విభజన చట్టం అమలుకు కూడా బాధ్యత వహించాలని తెలిపారు. ప్రతిపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంతో అనుసరిస్తున్న తీరు రాజకీయ ప్రయోజనాల కోసమేనని, రాష్టప్రతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రజలు, ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్న తెలుగుదేశం పార్టీ పార్లమెంటులో చివరి వరకూ పోరాడుతుందని, చివరి నిమిషంలో అవసరమైతే అన్ని పక్షాలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా మాదిగల రాజకీయ, ఆర్థిక, సామాజిక అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని, నాడు ఎన్‌టీఆర్ నుంచి నేటి వరకూ మాదిగలకు సముచితస్థానమిచ్చి గౌరవిస్తున్నట్టు తెలిపారు. నాడు ఎస్సీ వర్గీకరణను అమలుచేసి వేలాది మందికి ప్రయోజనం కల్పించామన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన వర్గీకరణ వలన మాదిగలు నష్టపోకుండా, వర్గీకరణ అమలుకు సమానమైన జీవోఎంఎస్ నెంబర్ 25ను తీసుకుచ్చి అన్ని విషయాల్లోనూ అమలుచేస్తున్నట్టు తెలిపారు. దళిత తేజం తెలుగుదేశం కార్యక్రమంతో చైతన్యం తీసుకుస్తున్నామన్నారు. దళిత వాడల్లో అభివృద్ధి పనులు, వౌళిక సదుపాయాలతోపాటు 75 యూనిట్ల కరెంట్ ను కూడా ఉచితంగా అందించి వెలుగులు నింపుతున్నామన్నారు. లిడ్‌క్యాప్‌కు పూర్వ వైభవం తీసుకుచ్చి చర్మకార ఉత్పత్తులకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. ఎన్‌టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యోన్నతి పథకాలను అమలుచేసి అగ్ర కులాల వారితో సమానంగా విదేశీ విద్యాభ్యాసం చేయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఒక్క టీడీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. మాదిగల మహాసభ చేసిన డిమాండ్ మేరకు రాష్ట్రంలోని 5వేల మంది డప్పు కళాకారులకు నెలకు 1500 రూపాయల చొప్పున నెలవారీ పెన్షన్ మంజూరు ప్రకటించారు. మాదిగలకు టీడీపీ ఆత్మబంధువని తెలిపారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్లా రామయ్య అధ్యక్షత వహించిన ఈ సభలో మంత్రులు కొత్తపల్లి జవహర్, దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, కాలువ శ్రీనివాసులు, పరిటాల సునీత, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, బుద్దా వెంకన్న, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు అనిత, బొండ ఉమమహేశ్వరరావు, గద్దె రామ్మోహన్, లిడ్‌క్యాప్ చైర్మన్ ఎరిక్సన్ తదితరులు పాల్గొనగా తొలుత ఏపీ ఎంఆర్‌పీఎస్ నేతలు ఎంఎస్ రాజు, జెల్లి రమణయ్య తోపాటు పలువరు ఎంఆర్‌పీఎస్ నేతలు తెలుగుదేశం పార్టీలో చేరిన సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు.