ఆంధ్రప్రదేశ్‌

మనది ధర్మ పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 20: ‘మనది ధర్మ పోరాటం. పోరు వ్యక్తులపై కాదు, అన్యాయంపైనే. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడేది లేదు’ అని టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల పోరా టం రాజకీయ లాభాల కోసమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాల్‌లో మంగళవారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లా డుతూ ‘పార్లమెంట్ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగింది. అక్కడే న్యాయం జరగాలి’ అన్నారు. ప్రత్యేక హోదాతో ప్రత్యేక సాయం సమానమని కేంద్రం చెప్పడం వల్లే అంగీకరించామన్నారు. అలాంటిది మిగతా రాష్ట్రాలకు హోదా ఎలా కొనసాగిస్తున్నారు? ప్రత్యేక హోదా ప్రతిపత్తి మిగతా రాష్ట్రాలకు ఇస్తున్నప్పడు మాకూ అదే పేరుతో ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను గౌరవించడం జాతీయ పార్టీల బాధ్యత అని, కాంగ్రెస్ చేసిన అన్యాయం సరిదిద్దుతారనే మరో జాతీయ పార్టీ బీజేపీని ప్రజలు గెలిపించారన్నారు. రెండు జాతీయ పార్టీలు న్యాయం చేయకపోతే ఎలా? అని రాష్ట్ర ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. మనం అడుగుతోంది విభజన చట్టంలో అంశాల అమలు, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హమీల అమలు, ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ఆర్థిక సహాయం అమలు గురించేనన్నారు. ‘కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమైనా బీజేపీకి పూర్తి ఆధిక్యత ఉంది. కనుకనే మన ఒత్తిడికి తగిన ఫలితం పొందలేకపోతున్నాం. ఈ పరిస్థతిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని చంద్రబాబు వివరించారు. ‘అవిశ్వాసం వల్ల ఒక్కరోజు చర్చతో ముగిసిపోతుంది. కేంద్రంలో పూర్తి మెజారిటీ ఉన్న బీజేపీని ఏం చేయగలం? అంతకంటే, జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై నిరంతర వత్తిడి పెంచితేనే ప్రయోజనం ఉంటుంది’ అన్నారు. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టే ఏపీకీ కేంద్రం ఇచ్చిందని, దీనిపై స్థానిక బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి ప్రశ్నించకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేంటని నిలదీశారు.
‘వైకాపా రోజుకో మాట మాట్లాడుతోంది. ముందు ఎంపీల రాజీనామాలు అంది. ఇప్పుడు ప్లేటు ఫిరాయించి అవిశ్వాసం అంటోంది’ అని దుయ్యబట్టారు. పునర్విభజన చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది అఖిల సంఘాల సమావేశమని, అఖిలపక్ష సమావేశం కాదని స్పష్టం చేశారు. అఖిల సంఘాలతో సంప్రదింపులు జరుపుతామని, దీనికి పార్టీలతో పాటు ప్రజాసంఘాలు కూడా హాజరుకావచ్చన్నారు. దీనిద్వారా విస్తృత ప్రజాభిప్రాయం తెలుసుకునే వీలుంటుందని, అసలైన జనాభిప్రాయం బైటపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. 5కోట్ల మంది ప్రజల డిమాండ్‌ను ప్రతి వేదికపైనా టీడీపీ నేతలు ప్రచారం చేయాలని, ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని ప్రజలకు వివరించాలని, ప్రతిఒక్కరూ నియంత్రణ పాటించాలని, పార్టీ లైన్ తప్పి మాట్లాడకూడదని చంద్రబాబు ఆదేశించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, అయ్యన్నపాత్రుడు, పరిటాల సునీత, కాలువ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న
జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు