ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా ఏపీకి సవాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఫిబ్రవరి 20: ప్రత్యేక హోదా ఆంధ్రుల గౌరవానికి సవాల్ లాంటిదని , ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని పీసీసీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చకుపెట్టాలని 144 నిబంధన కింద నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. మంగళవారం కడపలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆంధ్రుల ఆత్మగౌరవం పేరుతో కాంగ్రెస్ పార్టీ దీక్ష నిర్వహించింది.
ఈ దీక్షకు హాజరైన రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంట్‌లో చట్టం చేసి నాలుగేళ్లు అవుతున్నా ఇంతవరకూ దాని ఊసులేదన్నారు. ఈ అంశంపై రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించేందుకు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, మలికార్జున ఖర్గే నోటీసు ఇచ్చారన్నారు. హోదాపై పార్లమెంటులో తప్పకుండా చర్చకు పట్టుబడతామని ఆయన అన్నారు. చట్టంలో రాష్ట్రానికి ప్రత్యేక నిధులు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కడప ఉక్కు, విశాఖ రైల్వేజోన్ వంటి హామీలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకూ రాష్ట్రానికి సీమలో ప్రత్యేక ప్యాకేజి ప్రకారం 7 జిల్లాలకు రూ.24,300 కోట్లు ఇవ్వాల్సి వుండగా, రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. ఒక్క శాతం నిధులు గానీ, ఒక శాతం పనులు గానీ చేయలేదని విమర్శించారు. మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో నాలుగేళ్లు పూర్తయ్యిందని, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజే అనేక అనుమానాలు రేకెత్తించేలా ప్రసంగించారని, అప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందన్నారు. మోదీ చేస్తున్న మోసాలపై 420 కేసు పెట్టడంతోపాటు నిరాహార దీక్షలు, బంద్‌లు, ఆందోళనలు చేశామన్నారు. దీనిపై ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల స్పష్టత వచ్చిందన్నారు. పార్లమెంట్‌లో రాహుల్ ఒక్కడే కాదని ఆయన వెంట 14 పార్టీలు ఉన్నాయన్నారు. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వం పడిపోదని, అయినా బీజేపీ వైఖరిని ఎండగట్టేందుకు పార్లమెంట్‌ను వేదిక చేసుకుంటామన్నారు. టీడీపీ , బిజెపీ పరస్పరం దోబూచులాటలతో అబద్దాలాడుతున్నాయని, ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు.
వైసీపీ అధినేత జగన్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారని, ఆయనకు పార్లమెంట్‌లో ఎంతబలం ఉందని అవిశ్వాస తీర్మానం పెడతామని ప్రకటించారని రఘువీరా అన్నారు. ఆయనకు అంతమంది ఎంపీలు ఉన్నారని అని ఎద్దేవా చేశారు. ఏదో విధంగా బీజేపీతో జతకట్టి కేసులు నుండి బయటపడేందుకు జగన్ కుయుక్తులు పడుతున్నారని ఆక్షేపించారు. తెలుగువాళ్ల గౌరవాన్ని చంద్రబాబు ఢిల్లీలో తాకట్టుపెట్టారని దాని ఫలితంగానే మనకు బడ్జెట్‌లో ఎలాంటి నిధులు ఇవ్వడంలేదన్నారు.
chitram...
కడపలో జరిగిన ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష శిబిరంలో ప్రసంగిస్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి