ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి టెట్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 20: రాష్టవ్య్రాప్తంగా నేటి నుంచి నిర్దేశిత పరీక్షా కేంద్రాల్లో టెట్ పరీక్షలు జరుగుతాయని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి గంటి శ్రీనివాసరావు చెప్పారు. మార్చి 16న టెట్ ఫలితాలను వెల్లడిస్తామన్నారు. మార్చి 4న ప్రాథమిక కీ విడుదల చేస్తామని, 4నుంచి 9 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుందని, తుది కీ 12న విడుదల చేస్తామని వివరించారు. రాజమహేంద్రవరంలో మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్టవ్య్రాప్తంగా 4.61 లక్షల మంది టెట్ రాయనున్నారన్నారు. మార్చి 3వరకు పరీక్షలు ఉదయం, మధ్యాహ్నంజరగనున్నాయని చెప్పారు. 2016 డీఎడ్ బ్యాచ్‌కు రానున్న డిఎస్సీలో అవకాశం కల్పిస్తామన్నారు. 28 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నామన్నారు.
విద్యాసంస్థలకు వౌలిక సదుపాయలు కల్పించడానికి జిల్లాకు రూ.300 నుంచి రూ.400 కోట్ల వంతున మొత్తం రాష్టవ్య్రాప్తంగా రూ.4851 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడానికి టెండర్లు పిలిచామని మంత్రి గంటా వివరించారు. భవిష్యత్‌లో ఏ విద్యాసంస్థకు వౌలిక సదుపాయాలు లోటు లేకుండా చేస్తున్నామన్నారు. రాష్ట్రం నుంచి విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోకుండా ప్రైవేటు యూనివర్సిటీ బిల్లును కూడా తెచ్చామన్నారు. యూనివర్సిటీల మధ్య ఆరోగ్యకరమైన పోటీని కల్పించడం ద్వారా మరింత నాణ్యమైన జాతీయ స్థాయి విద్యను అందించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. యూనివర్సిటీల్లో 100 మంది ప్రొఫెసర్లు, 175 మంది అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకానికి యూనివర్సిటీలకే అధికారాలు ఇచ్చామని, యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఈ రిక్రూట్‌మెంట్ యూనివర్సిటీలే చేసుకుంటాయన్నారు. మొత్తం రాష్ట్రంలోని 14 యూనివర్సిటీలకు సంబంధించి 1385 అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి రిక్రూట్‌మెంట్‌ను ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నామని మంత్రి చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్లకు అవకాశం కల్పించేందుకు రిటైర్డు వీసీలు, రిటైర్డు ఐఎఎస్‌లతో ఒక ప్రత్యేక కమిటీని నియమించామన్నారు. ఈ కమిటీ విధి విధానాలపై ఒక నివేదిక ఇవ్వనుందని, ఈమేరకు కాంట్రాక్టు లెక్చరర్లకు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో స్థానం కల్పించి వారికి న్యాయం చేస్తామన్నారు. 14 యూనివర్సిటీలకు రూ.215 కోట్లు కేపిటల్ నిధులు విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించి ముందుగానే కేలండర్ తయారుచేసి ఆయా నిర్దేశిత గడువు మేరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఏ ప్రవేశ పరీక్ష ఎప్పుడు...
ఏపీ ఎడ్‌సెట్ ఏప్రిల్ 19న జరగనుందని, ఎస్వీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షను నిర్వహిస్తామని మంత్రి గంటా చెప్పారు. ఎపీ లాసెట్ పరీక్ష కూడా ఏప్రిల్ 19న జరగనుందని, అనంతపురం ఎస్కే యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుందని చెప్పారు. ఏపీ ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష కాకినాడ జెఎన్‌టియు ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుంచి 25 వరకు జరగనుందని తెలిపారు. ఏపీ ఎంసెట్ బైపీసీ పరీక్ష కాకినాడ జెఎన్‌టియు ఆధ్వర్యంలో ఏప్రిల్ 26న నిర్వహిస్తామన్నారు. ఏపీ ఐసెట్‌ను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ మే 2న నిర్వహిస్తుందని, ఏపీ ఈసెట్ అనంతపురం జెఎన్‌టియు మే 3న నిర్వహించనుందని తెలిపారు. ఏపీపీజీ ఈసెట్‌ను విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ మే 10 నుంచి 12 వరకు నిర్వహించనుందని తెలిపారు. ఏపీపీ ఈసెట్ గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మే 4న నిర్వహించనుందని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు.