ఆంధ్రప్రదేశ్‌

బూత్ కన్వీనర్లపై వైసీపీ ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 22: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత పనులను చాపకింద నీరులా చేసుకుపోతోంది. ఎప్పటికప్పుడు క్యాడర్‌ను అప్‌డేట్ చేస్తోంది. ప్రస్తుతం బూత్ కన్వీనర్లను లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతోంది. పెద్ద పెద్ద బహిరంగ సభలను ఏర్పాటు చేసేకన్నా బూత్ కన్వీనర్లచేత పద్ధతిగా పనిచేయించుకుంటే మంచి ఫలితాలను వస్తాయనేది పార్టీ యోచనగావుంది. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ బూత్‌ల కన్వీనర్లకు శిక్షణా శిబిరాలను ఏర్పాటుచేసుకుంది. నియోజకవర్గాల కో- ఆర్డినేటర్లు (పార్టీ అభ్యర్థులు) అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటుచేసి వారికి ఎన్నికల లక్ష్యాలను వివరిస్తోంది. ఎంతో సమయం లేదని ఇంకా ఏడాది కాలంలో పార్టీ అధికారంలోకి రానుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపడతారని శిబిరాల్లో బూత్ కన్వీనర్లకు నూరిపోస్తూ, కార్యోన్ముఖులను చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో బూత్ కమిటీల విషయంలో జరిగిన తప్పిదాలు మరోసారి జరగకుండా ఇప్పటి నుంచే పార్టీ జాగ్రత్తలు పాటిస్తోంది. ఇక నుంచి సమయానుకూలంగా అంటే కనీసం రెండు నుంచి మూడు మాసాలకు ఒకసారి బూత్ కన్వీనర్లతో సమావేశాలు ఏర్పాటుచేయడం, ఆ సమావేశాలకు రాని వారిని తొలగించి పార్టీకోసం కమిట్‌మెంట్‌తో పనిచేసే వారిని నియమించడం వంటిని చేయనున్నారు.ఇక రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావం ఎవరికీ తెలియందికాదు. 2014 ఎన్నికల్లో 543 లోక్‌సభ స్థానాలకు గాను 160 స్థానాల విజయంలో సోషల్ మీడియా ప్రభావం ఉందన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లో 42 స్థానాలకు గాను 11 లోక్‌సభ స్థానాల గెలుపులో సోషల్ మీడియా పాత్రవుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ వెబ్‌సైట్, ఫేస్‌బుక్, పార్టీ వాట్సప్‌లకు సంబంధించి క్యాడర్‌కు ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇస్తున్న హామీలు, భరోసాను సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ చేరవేసే అంశంపై ప్రత్యేకంగా శ్రేణులకు పార్టీ తరుపున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే శిక్షకులు తర్ఫీదునిస్తున్నారు. ఇది అంతర్గతంగా జరుగుతోంది. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ విజయమ్మ ఫొటోలతో పోలింగ్ బూత్‌స్థాయి పార్టీ శ్రేణుల శిక్షణా శిబిరం పేరుతో 40 పేజీల పుస్తకాలను ముద్రించింది. ఇవి క్షేత్రస్థాయిలో అందరికీ చేరేలా వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా వైఎస్సార్ చేసిన పనులు, జగన్ చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్ర విశేషాలను ఇందులో ప్రచురించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ససమయంలో ఇటువంటి పుస్తకాలు ప్రచురించి, పార్టీ క్యాడర్‌కు అందించారు. అదే తరహాలో ఇప్పుడు వైసీపీ కూడా పుస్తకాలు అందించి, వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేస్తోంది.