ఆంధ్రప్రదేశ్‌

కేర్ అండ్ షేర్ ఇటాలియా ప్రతినిధులు సీఎంతో భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కేర్ అండ్ షేర్ ఇటాలియా సంస్థ ప్రతినిధులు గురువారం కలిశారు. నిరాదరణకు గురైన పిల్లలు, అనాథలు తదితరుల సంక్షేమం కోసం ఈ సంస్థ పని చేస్తున్నది. విశాఖ జిల్లా పాడేరు డివిజన్‌లో 200 మంది విద్యార్థులను ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ చదివించేందుకు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చింది. 25 లక్షల రూపాయలతో ఉయ్యూరు అంగన్‌వాడీ కేంద్రంలో డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటుకు, మరో 30 డిజిటల్ క్లాస్ రూమ్‌లను 1.5 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని సీఎంకు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

చిత్రం..ముఖ్యమంత్రితో భేటీ అయిన షేర్ అండ్ కేర్ ఇటాలియా సంస్థ ప్రతినిధులు