ఆంధ్రప్రదేశ్‌

భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్రకు మహర్దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 24: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయితే ఉత్తరాంధ్ర జిల్లాలకు మహర్దశ వస్తుందని పౌర విమానయాన శాఖ మంత్రి పీ అశోక్ గజపతి రాజు అన్నారు. విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు శనివారం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సరకు రవాణా పెరిగితేనే ఈ ప్రాంతంలో ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం నుంచి వైదొలిగేందుకు ప్రత్యేకించి కారణాలేమీ లేవన్నారు. నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టును ఎయిర్ పోర్టు అథారిటీ నిర్మించి, నిర్వహణ నిమిత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిందని గుర్తు చేశారు. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు గతంలో టీడీపీ ప్రభుత్వమే నిర్మించిందని, ఇప్పుడు అత్యధికంగా సరకు రవాణా సాధిస్తోందన్నారు. భారత్‌లో విమానాల నిర్వహణకు సంబంధించి ఇప్పటి వరకూ సింగపూర్, దుబాయ్, శ్రీలంక దేశాపై ఆధారపడ్డామని, భోగాపురం ఎయిర్‌పోర్టు వినియోగంలోకి వస్తే సంవత్సరానికి 750 మిలియన్ యూఎస్ డాలర్ల ఖర్చు తగ్గుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల భాగస్వామ్యం పెంచేలా విమానయాన శాఖ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. విజయనగరం జిల్లా బాడంగిలో పురాతన ఎయిర్ స్ట్రిప్‌ను అభివృద్ధి చేసే ఆలోచనపై స్పందిస్తూ దేశ వ్యాప్తంగా 476 ఎయిర్ స్ట్రిప్‌లు ఉన్నాయని, అవసరమైన చోట వీటిని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఇప్పటి వరకూ రాష్ట్రంలో మంచి వాతావరణం నెలకొంటోందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య ఇప్పటి వరకూ ఆరు భాగస్వామ్య సదస్సులు నిర్వహించగా, వాటిలో మూడింటిని ఏపీలో నిర్వహించడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. ప్రత్యేక హోదా లేనందునే రాష్ట్రానికి పరిశ్రమలు రావట్లేదన్న విమర్శలు అర్ధరహితమని మంత్రి అశోక్ అభిప్రాయపడ్డారు. హోదా వల్ల ఏర్పడే వ్యత్యాసాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తే పరిశ్రమల ఏర్పాటు సాధ్యమేనని అన్నారు. ఇటీవల యుపీలో జరిగిన భాగస్వామ్య సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ బుందేల్‌ఖండ్‌కు రూ.20వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించడంపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అన్ని అంశాలూ పరిశీలించే నిర్ణయాలు తీసుకుంటారన్నారు. రాజకీయ పరంగా చూస్తే టీడీపీ, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. కేంద్రంలో టీడీపీ మైనర్ అయితే, రాష్ట్రంలో బీజేపీ మైనర్‌గా ప్రభుత్వాల్లో కొనసాగుతున్నామన్నారు. ఇంతకు మించి రాజకీయంగా మాట్లాదేమీ లేదన్నారు.