రాష్ట్రీయం

పంతమా? శాంతమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రజాసమస్యలను చర్చించే వేదికైన శాసనసభలో అధికార, విపక్షాలు వాటిని పక్కన పెట్టి, పంతాలు, పట్టింపులకు పోతున్నాయి. విపక్షాన్ని రెచ్చగొట్టి, వారిని తప్పుదోవపట్టించి తమ లోపాలు బహిర్గతం కాకుండా చూసుకోవాలని అధికార పక్షం ప్రయత్నిస్తున్నట్టు ప్రస్తుతం జరుగుతున్న శాససనభ సమావేశాలు చూస్తే అర్థం అవుతోంది. అవిశ్వాస తీర్మానాలతో సభా సమయం రెండు రోజులు వృథా అయింది. రోజా వ్యవహారంతో మరికొన్ని రోజులు సభలో రోజువారీ కార్యకలాపాలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర బడ్జెట్‌లో ఉన్న లోపాలను ప్రస్ఫుటంగా ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం ఇతరత్రా అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. విపక్షం సభలో ఉన్నా, లేకపోయినా, అధికార పక్షం తన వ్యూహాన్ని అమలు చేసుకుంటూ, అజెండాను ముందుకు తీసుకువెళుతోంది. తాజాగా రోజా సస్పెన్షన్ వ్యవహారం సభలో పెద్ద దుమారానే్న లేపుతోంది. దీనికి సోమవారం తెరపడుతుందా? లేక మరింత రాజుకుంటుందా? అన్నది చర్చనీయాంశమైంది.
తొందరపాటు చర్య?
అధికార పక్షాన్ని, అందునా ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని ఆరోపణలు, వ్యాఖ్యలు చేస్తున్న రోజా దూకుడుకు కళ్లెం వేసేందుకు అధికారపక్షం ప్రయత్నించింది. ఇందుకోసం స్పీకర్‌కు ఉన్న అధికారాలను వాడుకుంది. రోజాను సస్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి, కార్యదర్శి, స్పీకర్ కలిపి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. 2008 సంవత్సరంలో కరణం బలరాంను సభ నుంచి ఆరు నెలలపాటు సస్పెండ్ చేశారు. ఆయనను సస్పెండ్ చేసిన సమయంలో ఉత్తరోత్రా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా బాధ్యులు జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఆయన కోర్టుకు వెళ్లలేకపోయారు. ప్రివిలేజ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనను సస్పెండ్ చేశారు. అదే రోజా విషయంలో ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇవ్వకమునుపే ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వుల్లో కూడా సాంకేతిక లోపాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లోపాలను పట్టుకుని రోజా సుప్రీంకోర్టు వరకూ వెళ్లారు. ఇలా ఎందుకు జరిగింది? పార్టీ అధినేత వత్తిడి మేరకు రోజాను సస్పెండ్ చేసే ప్రక్రియలో పొరపాట్లు దొర్లాయన్న వాదన వినిపిస్తోంది. రోజాను సస్పెండ్ చేసిన తీరు సక్రమంగా లేదని హైకోర్టు పేర్కొంది. శాసనసభ వ్యవహారాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోని కోర్టు రోజా ఉదంతంలో జోక్యం చేసుకోవడం గమనార్హం. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లోని లోపాలను వెతికి, రోజాను శుక్రవారం సభలోకి అడుగుపెట్టకుండా చేసి, అధికార పార్టీ వివాదాన్ని మరింత జటిలం చేసింది. హైకోర్టు ఉత్తర్వులను మన్నించి, రోజాను సభలోకి అనుమతించి, మందలించి వదిలేస్తే అధికార పక్షానికి గౌరవం పెరిగేది. రాజకీయ క్రీడలో అలా జరగదు కదా! రోజాను సభలోకి రానీయకపోవడం వలన ఆమె ఇమేజ్ మరింత పెరిగింది. ఈ మొత్తం ఉదంతంలో సభాపతి, శాసనసభ వ్యవహారాల మంత్రిని అంతా వేలెత్తి చూపిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు ఎక్కడా తెర మీదకు రాలేదు. శుక్రవారం శాసనసభ వ్యవహారాలు ప్రారంభమైన తరువాత కూడా అధికార పక్షం నీరసంగా కనిపించింది. జగన్ బృందం అసెంబ్లీ ఆవరణలో చేస్తున్న ఆందోళన వివరాలను శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సభాపతి కోడెల శివప్రసాదరావు 11 గంటల సమయంలో తన స్థానంలో ఎమ్మెల్యే రామానాయుడిని కూర్చోపెట్టి ఆయన తన ఛాంబర్‌కు వెళ్లిపోయారు. కోడెల, యనమలతోపాటు మరికొంతమంది ముఖ్యులు రోజా వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలో సుదీర్ఘంగా చర్చించారు. పది నిముషాలపాటు టీ బ్రేక్ ఇచ్చి, సుమారు గంటన్నర వరకూ సభా కార్యక్రమాలను తిరిగి ప్రారంభించలేని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు సభాపతి కోడెల తిరిగి సభను ప్రారంభిస్తూ రోజా విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలను సభ్యులందరికీ పంపిణీ చేయించారు. రోజా సస్పెన్షన్‌పై సభలోనే నిర్ణయం తీసుకున్నాం కనుక ఈ విషయంపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది సభే నిర్ణయిస్తుందని, దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను సభకే అప్పగిస్తున్నానని ప్రకటించారు. వెంటనే మంత్రి యనమల మాట్లాడుతూ రోజా సస్పెన్షన్ అంశాన్ని సోమవారం సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దీన్నిబట్టి చూస్తే, ఈ విషయంలో సభాపతి కోడెల మరింత వత్తిడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరన్నది అర్థమవుతోంది. రోజా విషయాన్ని మరింత సాగదీయకుండా ఒక్క అడుగు వెనక్కు వేసినా మరింత నష్టం జరుగుతుందని. పోనీ ముందుకు వెళ్లాల్సి వస్తే, ముగింపు ఏవిధంగా ఉంటుందో తెలియని సంకట స్థితిలో పడింది అధికారపక్షం. ఇక వైకాపా విషయానికి వస్తే, డిసెంబర్ 18న శాసనసభలో రోజా ఇబ్బందికర వ్యాఖ్యలు చేశారన్న విషయాన్ని గుర్తించి, జగన్ జోక్యం చేసుకుని సర్దుబాటు చేసి ఉంటే, ఈ వివాదం ఇంత వరకూ వచ్చేది కాదు. అధికారపక్షం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని అవకాశంగా, ఈ ఉదంతం ముగింపు తనకు అనుకూలంగా మలచుకోవాలని వైకాపా ప్రయత్నిస్తోంది.