ఆంధ్రప్రదేశ్‌

ఏజెన్సీ ప్రాంతాల్లో ఫీడర్ అంబులెన్స్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ (విశాఖపట్నం), ఫిబ్రవరి 25: రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులకు సకాలంలో వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతనంగా మొబైల్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణ అంబులెన్స్‌లు వెళ్లలేని ప్రాంతాలకు సైతం సులువుగా వెళ్లేందుకు ప్రభుత్వం నూతన ఫీడర్ అంబులెన్స్‌లను వినియోగించనుంది. అన్ని ఐటీడీఎల పరిధిలో122 ఫీడర్ అంబులెన్స్‌ల ద్వారా సేవలు అందించనున్నారు. విశాఖ ఐటీడీఏ పరిధిలోని 42, పార్వతీపురానికి 24, సీతంపేటకు 15, రంపచోడవరం 21, చింతూరు 6, కేఆర్ పురానికి 8, శ్రీశైలానికి ఆరు అంబులెన్స్‌లను కేటాయించారు. అత్యవసర పరిస్థితిలో 108కి ఫోన్ చేయగానే సాధారణ అంబులెన్స్‌లతో పాటు ఇవీ కూడా ఆయా గ్రామాలకు వెళతాయి. అంబులెన్స్‌ల డ్రైవర్లకు శిక్షణ అందించనున్నారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు.