ఆంధ్రప్రదేశ్‌

రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవలు విస్తృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదాంబ (విశాఖపట్నం), ఫిబ్రవరి 25: రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ అందిస్తున్న సేవలను మరింత విస్తృతం చేయడంతో పాటు, ప్లేస్ రిక్నగైజేషన్ ఆధార్ గుర్తింపుకార్యక్రమాన్ని జూలై నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్టు రవాణాశాఖ రాష్ట్ర కమిషనర్ ఎం.సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఆన్‌లైన్ సేవలను గ్రామీణ స్థాయి నుంచి అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా 72 రకాల సేవలతో ఈ నూతన కియాస్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిఐఐ భాగస్వామ్య సదస్సు కార్యక్రమంలో తొలిసారిగా ఆదివారం ఆన్‌లైన్ కియాస్క్‌ను ఏర్పాటు చేసి, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ క్లౌడ్ టెక్నాలజీతో రెండు వైపులా వినియెగించుకునే విధంగా దీనిని ఏర్పాటు చేశామని, ఈ కియాస్క్‌ల ద్వారా త్వరలోనే ప్రైవేట్ సంస్థల ప్రకటనల సేవలను కూడా అందిస్తున్నామని తెలిపారు. ఈ క్లౌడ్ విధానంతో రూపోందించిన ఈ కియాస్క్‌లను గ్రామీణ స్థాయిలో అమలు జరిగే అన్ని రకాల పౌరసేవలకు సంబంధించిన వాటిని నేరుగా ఆన్‌లైన్ విధానం ద్వారా పొందవచ్చునన్నారు.