ఆంధ్రప్రదేశ్‌

పేదలకు జి ప్లస్ త్రి భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఫిబ్రవరి 25: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పేదలకు జి ప్లస్ త్రి భవనాలను నిర్మించడంతో పాటు షీర్ టెక్నాలజీతో వాటిని నిర్మిస్తున్నామని రాష్ట్ర మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 8.5 లక్షల ఇళ్లు అవసరం కాగా, ఇప్పటి వరకు 6.81 ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ఆదివారం ఇక్కడ సారిపల్లి, సోనియానగర్‌లో నిర్మిస్తున్న పట్టణ గృహ సముదాయాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మొదటి విడతలో 15 శాతం ఇళ్లను పూర్తి చేసి మార్చి 24 నాటికి 20 వేల ఇళ్లకు ప్రారంభోత్సవం చేస్తామన్నారు. జపాన్, ఉత్తరకొరియా, సింగపూర్, మలేషియా, చైనా, రష్యా దేశాల్లో పేదలకు నాలుగు అంతస్తుల భవన నిర్మాణాలు నిర్మించారని అదే విధంగా రాష్ట్రంలో పేదలకు జి ప్లస్ త్రి విధానంలో నిర్మిస్తున్నామన్నారు.