ఆంధ్రప్రదేశ్‌

దేశం గర్వించదగిన నటి శ్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 25: సినీ నటి శ్రీదేవి మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖలో ఉన్న సీఎం శ్రీదేవి మరణవార్త విన్న తరువాత సంతాప సూచకంగా ఆయన రెండు నిముషాలు వౌనం పాటించారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తీవ్ర సంతపాన్ని తెలిపారు. శ్రీదేవి చిరుప్రాయంలోనే సినీ రంగంలో ప్రవేశించి, జాతీయస్థాయి నటిగా ఎదిగారని అన్నారు. శ్రీదేవి వలన ఆంధ్ర ప్రదేశ్ సినిమా రంగానికి జాతీయస్థాయి గుర్తింపు లభించిందని అన్నారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు. ఇదిలా ఉండగా శ్రీదేవి మృతి పట్ల రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాలనటిగా అరంగేట్రం చేసిన ఆమె తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని అన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే శ్రీదేవి మృతిపట్ల మంత్రి గంటా శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బహుభాషా నటిగా తన అభినయంతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. శ్రీదేవి కుటుంబ సభ్యులకు ఆయన సంతాపాన్ని తెలిపారు. బహుభాషా నటిగా, తెలుగువారికి అత్యంత ఇష్టమైన కథానాయకిగా ఎదిగారని కొనియాడారు. శ్రీదేవి మృతి పట్ల ఉప ముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేశ్, అయ్యన్నపాత్రుడు, కళా వెంకటరావు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.

చిత్రం..విశాఖలో జరుగుతున్న సిఐఐ సదస్సులో ప్రముఖ సినీనటి శ్రీదేవి మృతికి సంతాపం తెలుపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తదితరులు