ఆంధ్రప్రదేశ్‌

మేం చెప్పలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21:సాక్షి ప్రసారాలను నిలిపివేయాలని ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ హైకోర్టుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సాక్షి ప్రసారాలను నిలిపివేసినట్టు సాక్షి మీడియా గ్రూప్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ ఎవి శేషసాయి విచారణ ప్రారంభించారు. ముద్రగడ పద్మనాభం దీక్ష తరువాత సాక్షి ప్రసారాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిలిపివేసిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంపై సాక్షి టెలివిజన్ ఎడిటోరియల్ బోర్డు డైరెక్టర్ కె రామచంద్రమూర్తి కోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ నిర్ణయం చట్ట వ్యతిరేకం అని, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించారని పిటిషన్‌లో తెలిపారు. కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాక్షి ప్రసారాలను నిలిపివేయాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.