ఆంధ్రప్రదేశ్‌

బస్ భవన్‌లో లీగల్ సెల్, పిఎఫ్ ట్రస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: హైదరాబాద్‌లోని ఏపిఎస్‌ఆర్టీసి బస్ భవన్ నుంచి ఉద్యోగులను విజయవాడకు తరలించినా, బస్‌భవన్‌లో కొన్ని శాఖలు పనిచేస్తాయని ఆర్టీసి ఎండి సాంబశివరావు హామీ ఇచ్చారని ఎంప్లారుూస్ యూనియన్ ఉపప్రధాన కార్యదర్శి పి దామోదరరావు తెలిపారు. లీగల్ సెల్‌తో పాటు స్ట్ఫా రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీం, స్ట్ఫా బెన్వవిలెంట్ ట్రస్టు, పిఎఫ్ ట్రస్టుల ఉద్యోగులు బస్‌భవన్‌లో పనిచేస్తారన్నారు. ఈ నెల 27వ తేదీ నాటికి విజయవాడకు ఆంధ్రా ఉద్యోగులు తరలిరావాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో తాము ఆర్టీసీ ఎండిని కలిశామన్నారు. బస్ భవన్‌ను పూర్తిగా ఏపి వదిలిపెడితే ఆర్టీసికి నష్టం వస్తుందని తాము ఎండికి తెలిపామన్నారు. ఆర్టీసి విభజన, ఆస్తుల పంపకం తేలే వరకు బస్‌భవన్‌లో కొన్ని శాఖల ఉద్యోగులు ఇక్కడే ఉండాలని తాము కోరామన్నారు. ఎండి సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం పట్ల ఎంప్లారుూస్ యూనియన్ స్వాగతించింది.