ఆంధ్రప్రదేశ్‌

కోడెలపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: కేంద్ర ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచేందుకు దాదాపు 11 కోట్ల రూపాయల వ్యయం చేసినట్లు ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వైకాపా డిమాండ్ చేసింది. మంగళవారం ఇక్కడ వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ సాక్షాత్తూ చట్టసభ గౌరవాన్ని, ప్రతిపత్తిని కాపాడాల్సిన స్పీకర్ తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టినట్లు ప్రకటించడంపై సుమోటోగా స్వీకరించాలన్నారు. స్పీకర్ అనైతిక పద్ధతుల్లో ఎన్నికల్లో గెలిచారని రూఢీ అయిందని, ఈ విషయమై తాము న్యాయనిపుణులతో చర్చించి అవసరమైతే ఉన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఎన్నికల సంఘం గతంలో కూడా నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువగా ఖర్చుపెట్టినట్లు రుజువైతే చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబ సభ్యుల అవినీతి పెచ్చుమీరిందని ఆయన ఆరోపించారు.