ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుపై కేసుల కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 21: తనపై ఆంధ్ర, తెలంగాణలో వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్న కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంబంధించిన రికార్డులను పరిశీలించిన తర్వాత చంద్రబాబు పిటిషన్‌లో పేర్కొన్న కేసుల ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఏ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం విచారణ నిమిత్తం స్వీకరించింది. తనపై ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం, తెలంగాణలో ఆదిలాబాద్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ నగరంలోని పోలీసు స్టేషన్లలో 2008లో కేసు నమోదు చేశారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించడం, పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం తదితర ఆరోపణలపై కేసులు నమోదు చేశారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు తరఫున న్యాయవాది కె రవీంద్రకుమార్ వాదనలు వినిపిస్తూ, ఇందులో చాలా కేసులు పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపైనే నమోదు చేశారన్నారు. వీటికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అనంతరం హైకోర్టు రికార్డులను పరిశీలించి ఈ కేసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.