ఆంధ్రప్రదేశ్‌

ఆర్థిక నేరగాళ్లు ప్రధానిని కలుస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆర్ధిక నేరస్థులు ప్రధానిని కలవడం ఎక్కడైనా ఉందా.. పీఎంవో చుట్టూ ఏ 2 నిందితుడి ప్రదక్షిణలు ప్రజలకు ఏం సంకేతాలు పంపిస్తున్నాయి? ఏమిటీ డ్రామాలు? ఎందుకీ నాటకాలు? తెరచాటు మంతనాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, పార్లమెంట్ హామీల అమలు తీరుపై శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేస్తామన్నారు. ఢిల్లీలో ఎంపీల పోరాటానికి సంఘీభావంగా స్థానికంగా కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలన్నారు. ఆందోళనలు శాంతియుతంగా, నిర్మాణాత్మకంగానే జరగాలని బాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి న్యాయం జరిగేవరకు పోరాటం కొనసాగించాలన్నారు. ప్రజల తరపునే ప్రతినిధులు నిలబడాలని, ప్రజల గొంతు పార్లమెంటులో ప్రతిధ్వనించాలన్నారు. 5కోట్ల ప్రజల మనోభావాలపై కేంద్రం ఉదాసీనత భావ్యం కాదని, పోరాటం నిర్మాణాత్మకంగానే జరగాలి, అభివృద్ధి ఆగిపోరాదన్నారు. కాగా బీజేపీలో జరిగే కీలక నిర్ణయాలన్నీ వైసీపీకి ముందే ఎలా తెలుస్తున్నాయని చంద్రబాబు ఆశ్చర్యం, అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్టప్రతి అభ్యర్థి ఎవరో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ముందే ఎలా తెలిసింది? కోవింద్ బీహార్ గవర్నర్‌గా ఉన్నప్పుడే విజయసాయిరెడ్డి వెళ్లి ఆయనను కలిశారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ.. ఎన్డీఏలో ఉన్నా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పేవరకూ నాకూ రాష్టప్రతి అభ్యర్థి ఎవరో తెలియదని ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే టీడీపీ ఎంపీల పోరాటం ఉండాలన్నారు. జాతీయ టీవీ ఛానళ్ల డిబేట్లలో తెలుగుదేశం పార్టీ గళం వినిపించాలని, రాష్ట్ర ప్రజానీకం మనోభావాలను దేశం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకోవాలని, శాసనసభ, శాసనమండలి విప్‌లు, చీఫ్‌విప్‌లు స్థానికంగా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలన్నారు. విశాఖకు రైల్వే జోన్ ఇచ్చేది లేదని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొనడం దురదృష్టకరమన్నారు.
ఒకవైపు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆవేదన ఉంటే, ఎంపీలు పోరాటం చేస్తుంటే, వారిని మరింత రెచ్చగొట్టేలా ఇటువంటి అంశాలను ప్రచారం చేయడం సమంజసం కాదు. తొలి ఏడాది పీఆర్‌సీ చెల్లింపులు, ఇతర ఖర్చులు వాయిదా వేసుకుని రైతులకు రుణ ఉపశమనం కింద రూ.7,500 కోట్లు ఇస్తే, వాయిదా వేసుకున్న ఖర్చులను కూడా చెల్లించేది లేదని కేంద్రం తిరస్కరించడాన్ని తప్పుబట్టారు.