ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ వర్సెస్ బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలు, పార్లమెంటులో ఇచ్చిన హామీలు అంశంపై మంగళవారం శాసనసభలో టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ శాసనసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే అనిత మాట్లాడుతూ వేలకోట్లకు గాను బేడా, పైసా విదిలించి కేంద్రం చేతులు దులుపుకుందని ఎద్దేవాచేశారు. స్పెషల్ స్టేటస్, ప్యాకేజీ రెండింటి విషయంలో ఏపీని వంచించారని మండిపడ్డారు. ఏ సెంటిమెంట్ ప్రకారం తెలంగాణ ఇచ్చారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కట్టుబట్టలతో రాష్ట్రాన్ని విడదీసి ఎందుకు అన్యాయం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపికి పడుతుందని విమర్శించారు. కనీస సంఖ్యలో కూడా ఎంపీలు లేని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెడతామనడం అజ్ఞానమన్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ వార్డు సభ్యులుగా కూడా గెలవలేని వారికి మిత్రపక్షం కదా అని రాజ్యసభ సీట్లు ఇచ్చామని, తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటే జరిగే పరిణామాలు వేరుగా ఉంటాయన్నారు. ఏపీ ప్రజలు ఎవడబ్బ సొత్తో డిమాండ్ చేయడం లేదని, హక్కుగా రావాల్సినవి ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల్లో ఉద్వేగాలను రాజకీయ లబ్ధికోసం రెచ్చగొడుతున్నారని, 13వ షెడ్యూలు ప్రకారం 9 సంస్థలు రాష్ట్రానికి మంజూరయ్యాయని వివరించారు. దుగ్గరాజపట్నం పోర్ట్ విషయంలో రాష్ట్రప్రభుత్వం స్థలం చూపకపోవడం వల్లే జాప్యం జరిగిందన్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి న్యాయం చేయకపోతే ప్రజలే తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు. బీజేపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ రాష్ట్భ్రావృద్ధికి కట్టుపడి ఉన్న పార్టీ బీజేపీ ఒక్కటేనన్నారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితుల్లో విభజన సమయంలో రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించడంతో పాటు ఏవేం కావాలో డిమాండ్ చేసింది తమ పార్టీయేనన్నారు. అయితే హోదాకు 14వ ఆర్థిక సంఘం వలన బ్రేక్ పడిందని చెప్పారు. 13వ ఆర్థిక సంఘంలో 32 శాతంగా ఉన్న నిధులను 14వ ఆర్థిక సంఘం నాటికి 42 శాతానికి కేంద్రం పెంచిందని గుర్తుచేశారు. స్వదేశీ ఆర్థిక సంస్థల నుండి తీసుకునే నిధులు కావాలని ముఖ్యమంత్రి కోరినందునే జాప్యం జరుగుతోందని వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సమీకరించక పోతే ద్రోహులుగా మిగిలి పోతారని టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఏ మేరకు న్యాయం జరిగింది ప్రజలకు గత నాలుగేళ్లుగా వివరిస్తూనే ఉన్నామని, హక్కుగా రావాల్సిన వాటా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. దీనికి విష్ణుకుమార్‌రాజు స్పందిస్తూ సంప్రదింపుల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన వాటా సాధించుకోవాలన్నారు.