ఆంధ్రప్రదేశ్‌

నినాదాలతో హోరెత్తిన ‘అనంత’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 13 : ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, పలు డిమాండ్ల సాధన కోసం ఆందోళనకారులు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో మంగళవారం అనంతపురం నగరం నినాదాలతో హోరెత్తింది. సాయంత్రం 5.30 గంటల సమయంలో నగరంలోని సప్తగిరి సర్కిల్ నుంచి క్లాక్ టవర్, ఓవర్ బ్రిడ్జి వరకూ ర్యాలీలు, రాస్తారోకోలతో దద్దరిల్లింది. ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీ స్థానిక క్లాక్ టవర్ వద్ద ఉన్న ఎన్‌జీఓ హోం నుంచి ప్రారంభమై సుభాష్‌రోడ్డు మీదుగా సప్తగిరి సర్కిల్ చేరుకుని అక్కడ మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు దీక్షా శిబిరం నుంచి బయటకు వచ్చి ఓవర్ బ్రిడ్జి వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు సీపీఐ ఆధ్వర్యంలో విశాఖపట్నం లేదా గుంతకల్లులో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని రైల్వే స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. వీరికి తోడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడిన పదుల సంఖ్యలో వాహనాలు గుంటూరుకు తరలి వెళ్లడం కూడా నగరంలో ప్రత్యేక పరిస్థితికి అద్దం పట్టాయి.
అనంతపురం సప్తగిరి సర్కిల్‌లో ఐక్య కార్యాచరణ కమిటీ మానవహారంగ