ఆంధ్రప్రదేశ్‌

హోదాను తాకట్టుపెట్టి నేడు పెడబొబ్బలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, మార్చి 19: విభజన అనంతరం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నాడు, నేడు ఒకేమాట చెప్తుంటే అందుకు విరుద్ధంగా చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తూ, దగాపడ్డామంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇకనైనా ఈ నాటకాలు కట్టిపెట్టి ప్రత్యేక హోదా కోసం తమతో కలిసి పోరాడాలన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సోమవారం జగన్ గుంటూరు జిల్లా పెదనందిపాడు వచ్చారు. ఈసందర్భంగా ప్రచార రథంపై నుంచి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో నాలుగేళ్లుగా చిత్తశుద్ధి లోపించిందన్నారు. కుయుక్తులు, కుతంత్రాలతో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో చంద్రబాబు మన మధ్యకు రానున్నారన్నారు. ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలో మీరే తేల్చుకోవాలని ప్రజలకు పిలుపిచ్చారు. మీ అందరి మద్దతు ఉంటే చెడిపోయిన రాజకీయ వ్యవస్థను సరిదిద్దుతానన్నారు. ఒక్క జగన్ వల్లే అది సాధ్యపడదని, మీరు తప్పక చేయూతనందించాలని కోరారు. చంద్రబాబును క్షమిస్తే బెంజికారు, కేజీ బంగారం ఇస్తానంటూ వంచిస్తారన్నారు. అవి లేకున్నా ఓటుకు మూడు వేల రూపాయలు ముట్టచెప్పేందుకు టీడీపీ ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అందరి ముఖాల్లో చిరునవ్వు, ఆనందం చూస్తారని చెప్పారు. టీడీపీ రాష్ట్రంలో ఒక్క పక్కా గృహాన్ని కూడా నిర్మించిన దాఖలాలు లేవన్నారు. ప్రస్తుతం రుణమాఫీ కోసం ఇస్తున్న డబ్బు వడ్డీకే సరిపోతుందన్నారు. కాంట్రాక్టులకు రేట్లు పెంచడానికి చేతులు వస్తాయి, వృద్ధులకు పింఛన్ పెంచడానికి మాత్రం రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఎడాపెడా పన్నుల బాదుడుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. మంచినీరు లేకపోయినా మద్యం షాపు లేని గ్రామమంటూ రాష్ట్రంలో కనిపించడం లేదన్నారు. జాబ్ రావాలంటే బాబు రావాలని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, నేడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీరే తేల్చుకోవాలని ప్రజలను కోరారు. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు చేతులు రావడం లేదని, నల్లమడ వాగు ఆధునీకరణకు నోచుకోలేదని, అప్పాపురం ఛానల్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని విచారం వ్యక్తం చేశారు. ప్రత్తిపాడు నియోజకవర్గం అటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు, ఇటు కృష్ణాడెల్టాకు చివరి ప్రాంతం కావడంతో వర్షం కురిస్తే అతివృష్టి, కురవకపోతే అనావృష్టిగా మారి ప్రజలు కడగండ్ల పాలవుతున్నారన్నారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారిందని జగన్ విచారం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, రావి వెంకటరమణ, గుంటూరు తూర్పు, మంగళగిరి, మాచర్ల ఎమ్మెల్యేలు మహ్మద్ ముస్త్ఫా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పినె్నల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.