ఆంధ్రప్రదేశ్‌

హోరాహోరీగా నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మార్చి 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు, విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు మానవహారాలు నిర్వహించారు. అలాగే విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని బీజైవైఎం, ఏఐవైఎఫ్ కూడా ధర్నాలకు దిగాయి.విశాఖ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు వంశీకృష్ణ శ్రీనివాస్, మళ్ల విజయప్రసాద్, తైనాల విజయకుమార్, కోలా గురువులు నేతృత్వంలో నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ హోదా విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. హోదా వలన ప్రయోజనం లేదని, అదేమీ సంజీవిని కాదన్న సీఎం ఇప్పుడు ఎందుకు మాట మార్చారని ప్రశ్నించారు. కేంద్రంపై వైసీపీ ముందుగా అవిశ్వాస తీర్మానం పెట్టిందని, దీనివలన తమక్కెకడ మైలేజ్ వస్తుందోనన్న భయంతో చంద్రబాబు హడావుడిగా కేంద్రంపై అవిశ్వాసాన్ని ప్రకటించారని అన్నారు. చంద్రబాబు అబద్ధాలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని వారు అన్నారు. ఈ మానవహారాల వలన నగరంలోని అనేక చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉండగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజైవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు ఆడారి కిషోర్‌కుమార్ నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా జరిగింది. అలాగే ఏఐవైఎఫ్ చంద్రశేఖర్ నేతృత్వంలో నగరంలో ర్యాలీ నిర్వహించారు.