ఆంధ్రప్రదేశ్‌

బాబును సాగనంపితేనే ఏపీకి హోదా సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, మార్చి 21: చంద్రబాబు దుర్మార్గ పాలనకు చరమగీతం పాడి వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపితే ఏపీకి హోదా సాధించుకోవచ్చని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రజలను సీఎం చంద్రబాబు నిలువునా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలోని మానుకొండవారిపాలెం గ్రామంలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. అనంతరం చిలకలూరిపేట పట్టణంలోని కళామందిర్ సెంటర్ వద్ద జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు అమలు చేయలేని హామీలు గుప్పించారన్నారు. రైతు రుణమాఫీ హామీలో ఇప్పటి వరకు చెల్లింపులు జరపలేదన్నారు. తీసుకున్న రుణాలకు వడ్డీలు చెల్లించలేని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారని, ఇప్పుడు చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మంత్రిగా ఉద్యోగం కల్పించుకున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులకు రెండువేల రూపాయల భృతి కల్పిస్తామని చెప్పిన హామీని విస్మరించారన్నారు. మద్యం బెల్ట్‌షాపులను ఎత్తివేస్తామని ప్రకటించిన చంద్రబాబు వీధివీధికీ మద్యం ఏరులై ప్రవహింప చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈదుర్మార్గ పాలన అంతమొందించి హోదా సాధించాలంటే వచ్చే ఎన్నికల్లో బాబును ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని, అనుభవం ఉన్న ముఖ్యమంత్రిగా చెప్పుకుంటూ ధరల నియంత్రణలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదా మాటెత్తితే విద్యార్థులను జైల్లో పెట్టిస్తామని బెదిరించిన చంద్రబాబు నేడు హోదా గురించి మాట్లాడుతున్నారని, ఆయన కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. ఇసుక మాఫియాను తన అనుచరులతో నడిపిస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీల ద్వారా అవిశ్వాస తీర్మానం పెడితే మద్దతిస్తామన్న చంద్రబాబు తామే అవిశ్వాసం పెడతామని అబద్ధాలు చెప్పారని ఆరోపించారు. హోదాను పక్కనపెట్టి ప్యాకేజీ మేలని కేంద్ర మంత్రులకు అర్ధరాత్రి సత్కారాలు చేసిన ఆయన ఇప్పుడు మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. హోదా విషయంలో వైసీపీ మొదటి నుంచీ పోరాడుతోందని తెలిపారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాలను ప్రకటించిన విధంగా ప్రవేశపెట్టి పేద, బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటామని జగన్ ప్రకటించారు.