ఆంధ్రప్రదేశ్‌

జపాన్ తరహా పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 21: కేంద్రంపై జపాన్ తరహా పోరాటానికి సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. బుధవారం ఉండవల్లిలోని సీఎం నివాస ప్రాంగణంలో సాధికార మిత్రలతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ జపాన్ పోరాటాల మాదిరిగా గంట ఎక్కువ పనిచేసి, అరగంట నిరసన ప్రకటిద్దామని ప్రతిపాదించారు. రాష్ట్రం కోసం ఎవరు శాంతియుత పోరాటాలు చేసినా మద్దతిస్తామన్నారు. నిరసనలో రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రభావం చూపేలా ఉండకూడదన్నారు. అవిశ్వాసంపై చర్చించకుండా, కేంద్రం ఎదురుదాడి చేయించడం ఎంతవరకూ సమంజసమన్నారు. డ్వాక్రా మహిళలను సెల్ఫ్ బిజినెస్ మహిళలుగా మార్చి పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తామని బాబు ప్రకటించారు. సాధికార మిత్రలు సంఘటిత శక్తిగా మారాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో, వార్డుల్లో సాధికార మిత్రల పనితీరు సత్ఫలితాలు ఇస్తోందనే నమ్మకం ఏర్పడుతోందన్నారు. వ్యక్తులుగా ఉంటే ఒక పరిధికి మాత్రమే లోబడి ఉంటామని, అదే సంఘటిత శక్తిగా అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మంది ఒక సంఘటిత శక్తిగా రూపుదిద్దుకుని, సాధికార మిత్రలకు నాందీ పలికించామన్నారు. కేంద్రం సహకరించినా, లేకపోయినా అక్కా చెల్లెళ్ల కోసం పసుపు, కుంకుమ, స్ర్తినిధి కింద నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడుగుతున్న కోర్కెలు గొంతెమ్మ కోర్కెలు కావని, విభజన చట్టంలో పెట్టిన హామీలేనని వాటిని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. అభివృద్ధి కోసం మరిన్ని గంటలు పనిచేయడానికి సిద్ధమని చెప్పారు. ప్రజల మేలు కోసం ఎన్ని త్యాగాలు చేయడానికైనా తాను సిద్ధమేనని అన్నారు. 2019 నాటికి రాష్ట్రం నూటికి నూరుశాతం అక్షరాస్యత సాధించాల్సిన విధానంలో ప్రణాళికలను సిద్ధం చేసుకొని ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. బాలింతలు, గర్భిణీలు, చిన్నారుల మరణాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆయా కుటుంబాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. రాష్ట్రాన్ని 100 శాతం ఓడీఎఫ్ ఫ్రీ రాష్ట్రంగా ఏప్రిల్ నాటికి తీర్చిదిద్దే బాధ్యతను సాధికార మిత్రలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పిల్లలలో పౌష్ఠికాహారం లోపం లేకుండా చూడాల్సిన బాధ్యత సాధికార మిత్రలదేనన్నారు. రాష్ట్రంలోని 2 లక్షల 50 వేల మందికి 70 శాతం సబ్సిడీపై ఆధునిక సాంకేతికతతో కూడిన పనిముట్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో సంతృప్తి శాతం పెంచేలా సాధికార మిత్రలు కృషి చేయాలన్నారు. బడికొస్తా కార్యక్రమం కింద హైస్కూల్ విద్యను అభ్యసించే బాలికలు 3 లక్షల 50 వేల మందికి సైకిల్స్ అందించిన ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. రాష్ట్ర హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం
ప్రజలందరిపై ఉందని, దీనికి రాజీలేని పోరాటం చేద్దామన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ఇస్తున్నామని, విదేశాలలో చదువుకునే వారికి 10 లక్షల సాయంతో ప్రోత్సహిస్తున్నామన్నారు. గ్రామాల్లో పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలు ఉండటానికి వీల్లేదని, వారిని గుర్తించి సాధికార మిత్రలు తగినవిధంగా అన్న అమృతహస్తం అందించాలన్నారు. కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, పి.నారాయణ, సెర్ప్ సీఈవో కె.కృష్ణమోహన్, వివిధ శాఖల ఉన్నతస్థాయ అధికారులు పాల్గొన్నారు.