తెలంగాణ

డిప్యూటీ కలెక్టర్‌గా ‘కిడాంబి’ నియామకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, ఇండోనేషియన్ ఓపెన్ సూపర్ సిరీస్ 2017 విజేత కిడాంబి శ్రీకాంత్‌ను డిప్యూటీ కలెక్టర్‌గా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నియమించింది. స్పోర్ట్సు కోటా కింద ఈ నియామకం చేపట్టింది. గత ఏడాది విజయవాడలో నిర్వహించిన అభినందన సభలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు గ్రూప్-1 సర్వీసెస్‌లో నియమించనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. 30 రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంటుంది. డాక్యుమెంట్లతో సీసీఎల్‌ఏను సంప్రదించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. డాక్యుమెంట్ల పరిశీలన తరువాత జిల్లాను కేటాయిస్తారు.
ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు

విజయవాడ, మార్చి 21: రాష్ట్రంలో ఐఎఫ్‌ఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూల్ సోషల్ ఫారెస్ట్రీ డివిజన్ డీఎఫ్‌ఓ ఆర్.యశోదా బాయిని విశాఖ జ్యూ క్యూరేటర్‌గా నియమించింది. ఆత్మకూరు వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌ఓ సెల్వంను విశాఖకు బదిలీ చేసింది. విశాఖలోని అలన్ చాంగ్ టెరన్‌ను డిప్యూటీ సీఎఫ్‌గా పీసీసీఎఫ్ కార్యాలయానికి బదిలీ చేసింది.
గడ్కరీకి కృతజ్ఞతలు

విజయవాడ, మార్చి 21: పోలవరం ప్రాజెక్టు కోసం రూ.1400 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా బీజేపీ శిక్షణ విభాగం రాష్ట్ర ఇన్‌ఛార్జి, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.విష్ణువర్థన్ రెడ్డి బుధవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విష్ణువర్థన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.

శాంతియుత ఆందోళనలకు టీడీపీ మద్దతు
వైకాపాతో కలిసి పాల్గొనవద్దు పార్టీ శ్రేణులకు కళా సూచన

విజయవాడ, మార్చి 21: ప్రత్యేకహోదా కోసం గురువారం నిర్వహించే రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో వైకాపాతో కలిసి పాల్గొనవద్దని టీడీపీ శ్రేణులకు రాష్ట్ర మంత్రి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు సూచించారు. పార్టీ నేతలతో కళా బుధవారం టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపాతో కలిసి పాల్గొంటే ఉద్రిక్తలు రెచ్చగొట్టే అవకాశం ఉందని, విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ప్రజాందోళనలు నిర్వహించాలన్నారు. అన్ని నియోజకవర్గాల కూడళ్లలో బైఠాయించి, నిరసన వ్యక్తం చేయాలన్నారు. శాంతియుతంగా నిర్వహించాలని, ప్రజలకు ఇబ్బంది కల్గించవద్దన్నారు. ఈ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని నిర్వాహకులు కోరగా, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం సమ్మతించారన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుకోసం ప్రత్యేక హోదా సాధన సమితి చేపట్టే జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ సంఘీభావం కావాలని కోరిన నేపథ్యంలో పాల్గొనాలని పార్టీ నిర్ణయించిందన్నారు. శాంతియుతంగా జరిగే నిరసన కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో టీడీపీ ముందుంటుని కళా వెంకట్రావు స్పష్టం చేశాఠు.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రతిపాదన లేదు సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ

విజయవాడ, మార్చి 21: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదన ఏదీ లేదని రవాణాశాఖ మంత్రి కే అచ్చెన్నాయుడు బుధవారం శాసనసభలో స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో నష్టాలలో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అంటూ వచ్చిన ప్రశ్నకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిస్తూ లేదండీ.. అసలు ఆ ప్రతిపాదనే లేకపోతే ఇక ప్రణాళికలు ఎలా రూపొందిస్తాం... ఎప్పటిలో విలీనం చేస్తామనే ప్రశ్న ఎందుకని వివరణ ఇచ్చారు. మంత్రి సమాధానంపై అధికారపక్ష సభ్యులే కాదు విపక్ష బీజేపీ సభ్యులు కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవటం గమనార్హం. వాస్తవానికి వైకాపా సభ్యులు పోచిమరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ అడిగిన ఈ ప్రశ్నకు బుధవారం చర్చకు వచ్చింది. ఇలాఉంటే మంత్రి ప్రకటనపై ఆర్టీసీ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, గుర్తింపు సంఘం నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రయ్య, ముఖ్య ఉపాధ్యక్షులు డీ సూర్య ప్రకాశరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు ప్రభుత్వ సాయం

విజయవాడ, మార్చి 21: ఆయిల్ పామ్ రైతు సంఘాల ద్వారా ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సాయం చేసే అంశం పరిశీలిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆయిల్‌పామ్ రైతు సంక్షేమ సంఘ ప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులతో ఆయిల్‌పామ్ గెలల ధరను నిర్ణయించేందుకు బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గెలల్లో ఆయిల్ రికవరీ శాతాన్ని నిర్ణయించేందుకు ఐఐఓపీఆర్ సంస్థ ద్వారా పరీక్ష చేయించేందుకు, అశ్వారావుపేట, పెదవేగి ఆయిల్‌ఫెడ్ యూనిట్లలో గెలలలకు విడిగా ప్రాసెసింగ్ చేసేందుకు, 25 సంవత్సరాల వయసు దాటిన తోటల తొలగింపునకు ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయించారు. గెలలను ప్రాసెస్‌చేసిన తరువాత వచ్చే వృథా నుంచి ఆయిల్ రికవరీ వేస్టేజీని తెలుసుకునేందుకు నిర్ణయించారు.

ప్రశ్నోత్తరాలలో వంద ప్రశ్నలు పూర్తి

విజయవాడ, మార్చి 21: ప్రస్తుత శాసనసభ సమావేశాల ప్రశ్నోత్తరాలలో బుధవారం నాటికి సరిగ్గా వంద ప్రశ్నలు పూర్తయ్యాయి. సెలవులు పోను ఇప్పటికీ 11 రోజులపాటు సమావేశాలు జరిగాయ. రెండో రోజు నుంచి రోజూ 10 ప్రశ్నల చొప్పున సభ ప్రారంభంలో చర్చకు వచ్చాయి. వందల సంఖ్యలోనే ప్రశ్నలు రాగా సమయాన్ని దృష్టిలో ఉంచుకుని లాటరీ పద్ధతిలో రోజుకు పది ఫ్రశ్నలను ఎంపిక చేశారు. వైకాపా సభ్యులు గైర్హాజరవుతున్నప్పటికీ ముందు ఇతర పార్టీ సభ్యులు ఇచ్చిన ప్రశ్నలతో సగటున కనీసం నాలుగు ప్రశ్నలు రాగా బీజేపీ సభ్యుల తరఫున రెండు రోజులకో ప్రశ్న చోటు చేసుకొంది.

ఆసక్తికర అంశం ఏమిటంటే వైకాపా సభ్యులు ఎంతో వ్యూహాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలే అధికంగా చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయమై ప్రభుత్వం చెప్పిన లిఖిత పూర్వక సమాధానం ఆర్టీసీ కార్మికులను తీవ్రంగా అసంతృప్తి పరిచింది. కొన్ని ప్రశ్నలకు అధికార పక్ష సభ్యులు తమకనుకూలంగా మలచుకుంటే మరికొన్ని మంత్రులను, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయి. వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వ సాయానికి సంబందించిన ప్రశ్న బీజేపీని, ప్రధాని మోదీని దుమ్మెత్తిపోయటానికి అధికార పక్ష సభ్యులకు ఆయుధంగా నిలిచింది.