తెలంగాణ

అక్రమ మైనింగ్‌తో ఆదాయానికి గండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: అక్రమ మైనింగ్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ఎమ్మెల్సీ కరణం బలరామ కృష్ణమూర్తి ఆరోపించారు. రాష్ట్ర శాసన మండలిలో బుధవారం ఈ మేరకు ప్రశ్న అడిగారు. క్షేత్ర స్థాయిలో అధికారులు అక్రమార్జనకు అలవాటుపడ్డారని ఆరోపించారు. కొండాయపాలెం చెరువును డంపింగ్ యార్డుగా మార్చేస్తున్నారని, చీమకుర్తిలో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. వివరాలతో ఫిర్యాదు చేసినా, అధికారులు స్పందించకపోవడంతో దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయిందన్నారు. రుజువులు చూపిస్తున్నా, అక్రమాలు జరగడం లేదనడం సరికాదన్నారు. దీనిపై గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణరంగారావు స్పందిస్తూ, అక్రమ త్వవకాలపై కేసులు నమోదు చేస్తున్నామని, అక్రమ రవాణాపై కేసులు నమోదు చేసి జరిమానా వసూలు చేస్తున్నామన్నారు. వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్, వంటి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అక్రమాలను తన దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటానని తెలిపారు.